బాలీవుడ్ బ్యూటీ, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే భామ కంగనా రనౌత్. తాను ఏ కామెంట్ చేసినా కూడా అది సంచలనం కాకమానదు. ఆమె ప్రస్తుతం లాకప్ అని ఒక కొత్త కాన్సెప్ట్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ షో కాన్సెప్ట్ కూడా చూడటానికి బిగ్ బాస్ లా కనిపించినా చాలా విభిన్నమైన షో అది. అందులో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి వారి డార్క్ సీక్రెట్స్ ను బయటపెట్టారు. అవి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. జడ్జిమెంట్ డే రోజు కూడా కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గత ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు ఇచ్చిన టాస్కుల విషయాన్ని ఆమె ప్రస్తావించింది.
ఇదీ చదవండి: ఆర్జే చైతు ఎలిమినేషన్ వెనుక కుట్ర జరిగిందా?
టాస్కుల్లో భాగంగా పూనమ్ పాండేకు సెడక్ట్రస్(సమ్మోహనరాలు) అనే టాస్కు ఇచ్చారు. అందులో ఎప్పిటలాగానే పూనమ్ పాండే అందరినీ ఆకట్టుకుంది. పూనమ్ పాండే ప్రదర్శనపై కంగనా రనౌత్ స్పందించింది. ‘మీరు చాలా బాగా ఆడారు. నిజంగా చాలా బాగా కవ్వించారు. నాకే ఎంతో హాట్ గా అనిపించింది అంటే మీరు ఎంతలా యాక్ట్ చేశారో తెలుస్తోంది. సమ్మోహన కళ(సెడక్షన్) అనేది 64 కళల్లో ఒకటి. మీరు అందులో దిట్ట అని నిరూపించుకున్నారు. ఇతర మహిళలకు ఈ కళను నేర్పేందుకు ఒక స్కూల్ ను ప్రారంభించండి’ అంటూ కంగనా పూనమ్ పై పొగడ్తల వర్షం కురిపించింది. కంగనా కామెంట్స్ కు పూనమ్ పాండే సిగ్గు పడుతూ నవ్వుకుంది. కంగనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.