ఫైర్ బ్రాండ్ అనగానే వెంటనే అందరికి కంగనా రనౌత్ గుర్తుకొస్తుంది. ఆమెకు నచ్చిన విషయాలను ఎంత అందంగా చెబుతుందో.. అలాగే నచ్చని విషయాలను కూడా అంతే స్ట్రాంగ్ గా వ్యక్తపరుస్తుంది. తాజాగా కంగనా.. తమిళ నటి, హీరో సూర్య సతీమణి జ్యోతికపై చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే వెంటనే అందరికి కంగనా రనౌత్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే.. ఈ బ్యూటీనే కదా.. బాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అని అనిపించుకుంది. ఆమెకు నచ్చిన విషయాలను ఎంత అందంగా చెబుతుందో.. అలాగే నచ్చని విషయాలను కూడా అంతే స్ట్రాంగ్ గా వ్యక్తపరుస్తుంది. తనకు ఎవరిపై కోపం వచ్చినా.. ప్రేమ వచ్చినా వెంటనే బయటపెట్టేస్తుంది. ఇష్టపడితే పరవాలేదు. కానీ.. ఆమెతో పడలేదంటే.. వాళ్ళ మీద విరుచుకుపడుతుందని చెప్పక్కర్లేదు అనుకుంట. నటిగా గొప్ప పేరు.. అవార్డులు.. రివార్డులు అందుకున్న కంగనా.. సినిమాలు లేనప్పుడు ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటుంది.
ఇందాకే చెప్పుకున్నాం కదా.. నచ్చిన విషయాలను ఎంతో అందంగా చెబుతుందని.. టాలెంట్ ఉన్న వారిని కూడా తనవైపు నుండి ఎంకరేజ్ మెంట్, ప్రశంసలు కూడా కురిపిస్తుంది. తాజాగా కంగనా.. తమిళ నటి, హీరో సూర్య సతీమణి జ్యోతికపై చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మధ్యకాలంలో హిందీ కంటే ఎక్కువ సౌత్ సినిమాలలో నటిస్తోంది కంగనా. ఆ విధంగా చంద్రముఖి 2లో అవకాశం దక్కించుకుంది. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న చంద్రముఖి 2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ.. జ్యోతిక గురించి కామెంట్ చేసింది. చంద్రముఖి మొదటి భాగం 2005లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కంగనా మాట్లాడుతూ.. “చంద్రముఖి సినిమాలో జ్యోతిక నటన అద్భుతం. ఆమె నటనకు ధీటుగా ఎవరి వల్ల కాదు. జ్యోతిక స్థాయిలో నటించే అంతటి సీన్ నాకు కూడా లేదు. అయితే.. జ్యోతిక రేంజ్ లో నన్ను కంపేర్ చేసి చూస్తే మాత్రం.. నిరాశ తప్పదని చెప్పగలను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా మాటలు సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరో విషయం ఏంటంటే.. చంద్రముఖి 2లో ముందు జ్యోతికనే అడిగినట్లు తెలుస్తోంది. ఆమె నిరాకరించడంతో ఆ పాత్ర అటు, ఇటు తిరిగి కంగనా చేతికి చేరిందట. చంద్రముఖిని తెరకెక్కించిన సీనియర్ డైరెక్టర్ పి. వాసునే ఇప్పుడు సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. కాగా, చంద్రముఖిలో సూపర్ స్టార్ రజిని నటించారు. ఇప్పుడు సీక్వెల్ లో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. మరి చంద్రముఖి 2పై మీ అంచనాలు, అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.