Kamya Panjabi: పేదవాడి దగ్గరి నుంచి పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు చాలా మందికి పానీ పూరీ అంటే ప్రాణం. ఒక్క రోజు పానీ పూరీ తినకపోయినా ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలవుతుంటారు కొందరు. పానీ పూరీ తింటూ లోకాన్ని సైతం మర్చిపోతుంటారు. తాజాగా, బాలీవుడ్ నటి కామ్యా పంజాబీ పానీ పూరీ తినాలన్న మోజులో లక్ష రూపాయల్ని మరిచిపోయింది. అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే.. ‘‘ నేను ఓ ఈవెంట్ కోసం ఆదివారం ఇండోర్‌లో ఉన్నాను. నేను తిరిగివస్తున్నపుడు.. నా స్నేహితుడు సంతోష్ గుప్త నాకో మాట చెప్పాడు. నేను ఉన్న ప్రదేశంలో ఓ మంచి పానీ పూరీ స్టాల్ ఉందని చెప్పాడు. ఇండోర్ సాధారణంగానే చాట్‌కు ఫేమస్ కాబట్టి.. నేను నా కోరికను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎలాగైనా పానీ పూరి తినాలనుకున్నాను. ఆ స్టాల్‌కు వెళ్లాను.
ఆ టైంలో నా దగ్గర లక్ష రూపాయలు ఉన్న ఎన్వలప్ ఉంది. స్టాల్‌లోని టేబుల్‌పై దాన్ని పెట్టి పానీ పూరీ తిన్నాను. పానీ పూరీ తింటూ, ఫొటోలు తీసుకుంటూ లోకాన్ని మర్చిపోయాను. ఆ తర్వాత డబ్బుల కవర్‌ను కూడా అక్కడే మర్చిపోయి బయటకు వచ్చేశాను. నేను నా హోటల్‌కు వచ్చిన తర్వాత డబ్బుల కవర్ సంగతి గుర్తొచ్చింది. నేను విషయం చెప్పటంతో నా స్నేహితుడొకడు అక్కడికి వెళ్లాడు. నేను చాలా ఆందోళనకు గురయ్యాను. డబ్బులు దొరకాలని దేవుడ్ని ప్రార్థించాను. అతడు అక్కడికి వెళ్లిన తర్వాత నా కవర్ అక్కడే టేబుల్ మీద కనిపించింది.
అతడు వెంటనే స్టాల్ ఓనర్ దినేశ్ గుజ్జర్‌తో మాట్లాడి, కవర్‌ను వెనక్కు తెచ్చిచ్చాడు. నేను థ్రిల్ అయ్యాను. నేను ఎలా రియాక్ట్ కావాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది చాల బిజీ ప్రాంతం. నేను అది దొరకదేమో అనుకున్నాను. ఇలాంటివి జరగటం అద్భుతంగా.. ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇండోర్ ప్రజలు చాలా మంచి, దయగల వారని నేను భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. మరి, కామ్యా పంజాబీ పానీ పూరి సెంటర్‌లో డబ్బులు మర్చిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : The Legend: శరవణ స్టోర్స్ వారి ‘ది లెజెండ్’ మూవీ ఫంక్షన్ లో 10 మంది స్టార్ హీరోయిన్లు.. ఏంటీ విడ్డూరం!