సినిమా ఇండస్ట్రీలో ఎంత అట్టహాసంగా పెళ్లిళ్లు జరుగుతాయో.. అంతే పబ్లిసిటీతో విడాకులు కూడా జరుగుతుంటాయి. కారణాలు ఏవైనా తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన, పెడుతున్న స్టార్ కపుల్ చాలా మందే ఉన్నారు. సాధారణంగా నిత్యం ఎంతో మంది విడాకులు తీసుకుంటారు. కానీ, సెలబ్రిటీలు కాబట్టి వారి పేర్లు ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పైగా వాళ్లంతా ఇన్ఫ్లూఎన్సర్స్ కాబట్టి కాస్త ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఏళ్ల తర్వాత అయినా కానీ వారికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతూనే ఉంటాయి. వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? విడాకుల తర్వాత వాళ్లు ఎలా ఉన్నారు? లాంటివి ఎప్పుడొకప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం కమల్ హాసన్ మాజీ భార్య సారికా ఠాకూర్ కు సంబంధించిన ఓ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
విషయం ఏంటంటే.. 1998లో వివాహం కమల్ హాసన్- సారికా ఠాకూర్ వివాహం చేసుకున్నారు. వారికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత 2004లో కమల్ హాసన్- సారికా విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ ఎవరి జీవితాన్ని వాళ్లు గడుపుతున్నారు. సారికా మొదటి నుంచి ఇండస్ట్రీలో ఉంది కాబట్టి మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఉంది. తర్వాత ఆమె గురించి పెద్దగా వార్తలు ఏమీ రాలేదు. కానీ, తన జీవితంలో గడిపిన అత్యంత గడ్డు పరిస్థితుల గురించి సారికా ఇటీవల ప్రస్తావించారు. ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత తన జీవితం ఆర్థికంగా ఏ మలుపు తిరిగిందో చెప్పుకొచ్చారు.‘జీవితం రొటీన్ సాగుతోంది.. ఏదో అనుకోని నిద్ర లేవడం ప్రయత్నించిన పని జరగక మళ్లీ నిద్రపోవడం చేశాను. అందుకే కొంతకాలం బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాను. అయితే నిజానికి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాను. కానీ, అది కాస్తా ఐదేళ్ల బ్రేక్ అయిపోయింది. లాక్ డౌన్ వచ్చింది చేతిలో డబ్బు అయిపోయింది. ఇంక ఏం చేయాలి తిరిగి నటించాలి. థియేటర్ చేస్తే రోజుకు 2 వేల నుంచి 2700 వస్తుంది. నిజానికి ఒక ఏడాది మాత్రమే బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాను’ అంటూ సారికా తను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆవిడ మే 13న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘మోడ్రన్ లవ్: ముంబై’ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. సూరజ్ బర్జాత్యా మూవీలో కూడా సారికా యాక్ట్ చేస్తున్నారు. సారికా పంచుకున్న ఆర్థిక ఇబ్బందులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.