స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. ఈ మాటలతోనే ఆమె బాల్యం ప్రారంభం అయ్యింది. చిన్నప్పుడు తండ్రి.. తనని, తల్లిని వదిలేస్తే కుటుంబ భారాన్ని భుజానికి ఎత్తుకుంది. బడికి పోలేదు కానీ, బాలనటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తల్లి మాత్రం ఆమెను కేవలం డబ్బు తెచ్చిపెట్టే యంత్రంగానే చూసింది. నటించడం, డబ్బు సంపాదించడం, తల్లి చేతిలో దెబ్బలు తినడం తప్ప మరేమీ తెలియకుండా పెరిగింది. తల్లి పోయిన తర్వాత స్వేచ్ఛ దొరికింది కానీ, సరైన ప్రేమను మాత్రం పొందలేకపోయింది. ఎంత మంది తన జీవితంలోకి అడుగుపెట్టినా గాయాలు చేసి వెళ్లారే తప్ప.. ప్రేమ మాధుర్యాన్ని మాత్రం పంచలేదు. చివరకి పెళ్లి కూడా ఆమెకు శాశ్వత ప్రేమను పంచలేకపోయింది. కోట్లు సంపాదించినా కూటికి గతిలేని దీనస్థితికి చేరుకుంది. చిన్నాచితక వేషాలు వేసి పొట్ట పోసుకుంది. పొట్టకూటి కోసం తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు కమల్ హాసన్ మాజీ భార్య, శ్రుతి హాసన్, అక్షర హాసన్ తల్లి సారికా ఠాకూర్ కన్నీటి గాథ ఇది.
సారికా ఠాకూర్ జీవితం మొత్తాన్ని పరిశీలిస్తే ఆమె ఓ భగ్న ప్రేమికురాలని అర్థమవుతుంది. చిన్నప్పుడు నాలుగేళ్ల వయసులోనే తన తల్లిని, తనను ఆమె తండ్రి వదిలేశాడు. ఆ తర్వాత అనుకోకుండా సారికా ఠాకూర్ కు బాలనటిగా అవకాశం వచ్చింది. ఆమెకున్న ట్యాలెంట్ కు చాలా మంచి గుర్తింపు లభించింది. వరుస ఆఫర్లు, మంచి రెమ్యూనరేషన్ తో ఇండస్ట్రీలో రాణిస్తోంది. కానీ, ఆమెకు ఎంత డబ్బు వస్తుంది అనేది ఆమెకు తెలియదు. తల్లిని అడగాలంటే ధైర్యం సపిరోదు. ఎందుకంటే కుంటుబాన్ని పోషిస్తున్నా కూడా ఆమెపై తల్లి ఏ మాత్రం ప్రేమ చూపించేది కాదు. ఎప్పుడూ కొడుతూనే ఉండేది. నటించడం తప్ప మరేమీ తెలిసేది కాదు. కనీసం బడికి కూడా వెళ్లలేదు. సారికకు చదువంటే ప్రాణం.. ఏది కనిపించినా చదవకుండా వదిలి పెట్టదు. ట్యూషన్ చెప్పిస్తే ఆ మాస్టారు చెప్పిందే చెప్పి డబ్బు చేసుకున్నాడు తప్పి నేర్పింది ఏమీ లేదు.
ఇదీ చదవండి: ఘనంగా హీరోయిన్ ప్రణీత సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్!
తను సంపాదించింది మొత్తం తల్లి చేతికి వెళ్లేది. అసలు ఆమెకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది అనే విషయం కూడా సారికాకు తెలిసేది కాదు. ఓరోజు తల్లి లేకుండా షూటింగ్ వెళ్లినప్పుడు డైరెక్టర్ 1500 ఇచ్చాడు. ఆ మొత్తం డబ్బుతో సారికా ఠాకూర్ పుస్తకాలు కొనేసింది. ఇంటికి వెళ్లాక ఆ విషయం తెలుసుకుని తల్లి సారికను బాగా కొట్టేసింది. రాత్రంతా ఏడ్చి తిరిగి తెల్లారి మళ్లీ షూటింగ్ కు వెళ్లింది. సారిక సంపాదనతో ఆమె తల్లి ఏకంగా ఐదు అపార్టుమెంట్లు కొనేసింది. ఆ విషయం సారికకు కూడా తెలుసినా ఆమెను అడిగే ధైర్యం లేదు. అంత సంపాదించినా కూడా కారులో పడుకోవడం, ఫ్రెండ్స్ అపార్టుమెంట్లలో స్నానం చేయడం, తప్పని పరిస్థితుల్లో ఇంటికి వెళ్లడం చేసేది.
కొన్నాళ్ల తర్వాత సారికా ఠాకూర్ ఆమె తల్లి మరణించింది. ఆమెకు కాస్త ఉపశమం, స్వేచ్ఛ లభించినట్లు అనిపించింది. కానీ, తన డబ్బుతో తల్లి కొనుగోలు చేసిన ఐదు అపార్టుమెంట్లు ఆమె ఎవరికో ఇచ్చేసింది. సారిక తరఫున అడిగేందుకు ఎవరూ లేదు. అలాంటి సమయంలో ఆమీర్ ఖాన్ లీగల్ గా సారికకు సహాయం చేసినట్లు సమాచారం. ఆమీర్ ఖాన్ కజిన్ నుజత్ సారికకు మంచి ఫ్రెండ్ కావడంతో ఆమెవైపు నుంచి ఆమీర్ ఖాన్ సహాయం పొందినట్లు తెలుస్తోంది. తల్లి చనిపోయిన తర్వాత ఒంటరిగా మారిపోయింది. అలాంటి సమయంలో కపిల్ దేవ్(భారత్ మాజీ కెప్టెనే) రూపంలో ఆమె జీవితంలో ప్రేమ చిగురించింది. కపిల్ ను కలిసేందుకు రెగ్యూలర్ గా ఛండీగఢ్ వెళ్లేది. కపిల్ దేవ్ కుటుంబసభ్యులతోనూ ఆప్యాయంగా ఉండేది. కానీ, కపిల్ కు ఆల్రెడీ రోమీ అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుసుకునేందుకు ఆమెకు చాలా సమయం పట్టింది. కపిల్ దేవ్ తో ఆమె రిలేషన్ బ్రేకప్ స్టోరీగానే మిగిలిపోయింది.
ఇదీ చదవండి: ‘సలార్’ స్టోరీ విషయంలో క్రేజీ లీక్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ!
కపిల్ తర్వాత ఆమె బాలనటుడి సమయం నుంచే ఎంతో సుపరిచితుడైన సచిన్ పిల్గావ్కర్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు అదీ సక్సెస్ కాలేదు. మళ్లీ మోడల్ పరాశర్ తో కొన్నాళ్లు రిలేషన్ కొనసాగించింది.. మళ్లీ అదే పాత రిజల్ట్ వచ్చింది. మళ్లీ ఒంటరితనం తనను వెంటాడసాగింది. సాగర్ అనే సినిమా తర్వాత కమల్ హాసన్ ముంబైకి మకాం మార్చాడు. అదే సమయంలో సారికా ఠాకూర్ కు దగ్గరయ్యాడు.. వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే కమల్ కు వివాహం అయ్యింది. అయితే సారికతో రిలేషన్ మొదలైన తర్వాత వాణి గణపతితో విడాకులు తీసుకుంటాడు అని జోరుగా ప్రచారం సాగింది. అందరూ అనుకున్న విధంగానే తర్వాత వాణిగణపతితో కమల్ హాసన్ విడాకులు తీసుకున్నాడు. కమల్ హాసన్ తో లివ్ రిలేషన్ షిప్ ప్రారంభించిన సారిక.. పెళ్లికి ముందే 1986లో శ్రుతిహాసన్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లిచేసుకున్నారు. 1991లో కమల్- సారికకు అక్షర హాసన్ పుట్టింది.
కమల్ తో పెళ్లైన తర్వాత కొన్నాళ్లకే ఇండస్ట్రీని వదిలేసింది. బాలీవుడ్ లో సరైన స్టార్ట్ దొరకలేదని కమల్ హాసన్ కూడా చెన్నైకి వచ్చేశాడు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సారిక ఇండస్ట్రీని వదిలేసింది. కమల్ తో కలిసి చెన్నైకి వచ్చేసింది. ఆ తర్వాత కమల్ హాసన్- సారికా ఠాకూర్ 2004వ సంవత్సరంలో విడాకులు తీసుకోగా.. పిల్లలు ఇద్దరూ తండ్రితోనే ఉన్నారు. విడాకుల సమయంలో సారిక భరణం తీసుకుందా, లేదా? ఆమెకు ఆ సమయంలో కమల్ నుంచి ఏమైనా ఆస్తులు సంక్రమించాయా అన్నది ఎవరికీ తెలియదు. మళ్లీ ఒంటరితనం ఆమెను చుట్టుముట్టింది. పిల్లలు సారికా గురించి ఏమనుకున్నారో ఏమో.. వాళ్లు కూడా ఆమెను చూడటం చేయలేదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వారి రిలేషన్ కాస్త పర్లేదని చెప్పాలి.
ఇదీ చదవండి: గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్ బోల్డ్ ఫొటోస్ వైరల్
ఆ తర్వాత ఆమె ఆస్తులన్నీ కరిగిపోయాయి. రోజుకు 2 వేలు, 2700కు స్టేజ్ షోలు కూడా చేసింది. కొన్నాళ్లు అవి కూడా లేక ఒక సంవత్సరం మొత్తం బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత లాక్ డౌన్ రావడంతో తింటానికి కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి. అలా చిన్నప్పటి నుంచి కోట్లు సంపాదించినా కూడా తనని మాత్రం ఆర్థిక కష్టాలు పలకరిస్తూనే ఉన్నాయి. అయితే కోట్లు సంపాదిస్తున్న కమల్, శ్రుతిహాసన్, అక్షరలు మాత్రం ఆమె పరిస్థితిని పట్టించుకున్న పాపాన పోలేదనే వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. ఆమె ఎంత దీన స్థితిలో ఉన్నా కూడా వారు మాత్రం ఆదరించలేదనేది వారిపై ఇప్పటికీ ఉన్న అపవాదు. తాజాగా మే 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘మోడ్రన్ లవ్: ముంబై’ వెబ్ సిరీస్ తో సారిక ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. సూరజ్ బర్జాత్యా సినిమాలోనూ సారిక నటిస్తోంది. సారికా ఠాకూర్ కన్నీటి గాథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.