Kalyan Ram: తెలుగు పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెర ఇలవేల్పు నందమూరి తారక రామారావు గారి నట వారసులుగా ఆయన కుమారులు, మనవళ్లు కొందరు సినిమాల్లోకి వచ్చారు. వారిలో నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఒకరు. 1989లో బాలక్రిష్ణ హీరోగా వచ్చిన ‘బాల గోపాలుడు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత 2003 ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరో అయ్యారు. సరిగ్గా మూడేళ్లకు స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదుర్చిన వివాహం. పెళ్లి చూపులప్పుడే స్వాతి నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారు.
అలా కోరుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. స్వాతి విషయానికి వస్తే.. ఆమె ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. స్వాతి తండ్రికి పలు కంపెనీలతోపాటు ఎన్నో బిజినెస్‌లు ఉన్నాయట. స్వాతి పెళ్లికి ముందు వైద్యురాలిగా పనిచేశారు. పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వైద్య వృత్తిని వదిలేశారు. పూర్తిగా కుటుంబానికే పరిమితమయ్యారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. తారక అద్వైత , శౌర్యరామ వారి పేర్లు. ఇక, పిల్లలు పెద్దవాళ్లు కావడంతో కళ్యాణ్ రామ్ సహాయంతో స్వాతి కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఓ వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు.
కాగా, ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బింబిసార’ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే రూ. 6.3 కోట్లు షేర్, రూ. 9.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక, రెండవ రోజు కూడా ‘బింబిసార’ కలెక్షన్ల పరంగా వ్వావ్ అనిపించింది. మొదటి రోజును మించి వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 19.9 కోట్ల రూపాయల గ్రాస్, 12.14 కోట్ల షేర్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 16.3 కోట్ల గ్రాస్, 10.7 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి, కల్యాణ్ రామ్ భార్య స్వాతి బ్యాక్‌గ్రౌండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nani: నేచురల్ స్టార్ నానికి ప్రమాదం..