హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరు మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. అందులో భాగంగా కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ముంబైలో బంధు మిత్రుల సమక్షంలో వివాహాం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. గౌతమ్, కాజల్ స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుంటు న్నారనేది కాజల్ సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లోనే చదువుకున్నారట. కాజల్ గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్నప్పటి నుంచి ఎక్కడ చూసినా వీరి ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ జంట గురించే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ముంబై వీధుల్లో వర్షాల ను ఎంజాయ్ చేసేందుకు ఈ జంట రోడ్డు ట్రిప్‌కు తమ కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా వారు కారులో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటో వారిద్దరూ కారులో సెల్ఫీ తీసుకున్నట్టు ఉంది.
ఈ ఫొటోను పోస్ట్ చేసిన గౌతమ్ కిచ్లూ జీవితంలో గొప్ప అనుభూతులు ఎల్లప్పుడూ ప్లాన్ లేకుండానే వస్తాయని చెప్పాడు. అందుకు ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ ట్రిప్ తమ వివాహ ప్రయాణానికి మరో అధ్యాయమని వివరించాడు. ప్రస్తుతం షేర్ చేసిన ఈ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.