తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జీవిత, రాజశేఖర్ దంపతులు. ప్రస్తుతం వీరి కుమార్తెలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల జీవిత, రాజశేఖర్ లపై పలు ఆరోపణలు రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తమను జీవిత, రాజశేఖర్ దంపతులు దారుణంగా మోసం చేశారని జ్యో స్టార్ అధినేతలు కొటేశ్వరరావు, హేమ ఆరోపించారు. గరుడ వేగ సినిమా నిర్మాణం సమయంలో ఈ జంట తమ వద్ద తమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ఇవ్వగా అవి తనఖా పెట్టుకొని రూ. 26 కోట్లు ఇచ్చామని.. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
గరుడవేగ చిత్రం ఆర్థిక విషయాల్లో తాము ఎలాంటి తప్పులు చేయలేదని జీవితా రాజశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించి తెలిపారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ లావాదేవీలకు సంబంధించిన అన్నీ క్లీయర్ గానే ఉన్నాయని.. కావాలని తమను ఇలా ఇబ్బంది పెడుతున్నారని జీవిత, రాజశేఖర్ దంపతులు వాదిస్తున్నారు. ఇండస్ట్రీలో తమ పేరుని నాశనం చేయడానికి ఆ దంపతులు కంకణం కట్టుకున్నారని అంటున్నారు.
ఈ విషయంపై జ్యోస్టార్స్ అధినేతలు స్పందిస్తూ.. ఇటీవల జీవితా రాజశేఖర్ మాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. గరుడ వేగ మూవీ నిర్మాణ సమయంలో తమ దగ్గరకు వచ్చి డబ్బులు పూర్తిగా అయిపోయాయి.. సినిమా పూర్తి కావాలంటే మీరు సహాయం చేయాలని జీవిత, రాజశేఖర్ దంపతులు ఎంతగానో ప్రాధేయపడ్డారని.. ఆ సమయంలో వారి ఆస్తులు తనఖా పెట్టుకొని డబ్బులు ఇచ్చామని అన్నారు. అంతేకాదు అగ్రిమెంట్ ప్రకారమే మేం అడిగామని.. జీవితా రాజశేఖర్ సినిమాలో పార్ట్నర్స్. 75 శాతం జీవిత అయితే.. 25 శాతం మేం అన్నారు. తాము అగ్రిమెంట్ ప్రకారం అడుగుతున్నామని అన్నారు. కొంతమంది పెద్దల సమక్షంలో కూడా కొన్ని ఒప్పందాలు అయ్యాయని.. ఆమె తన ఆస్తులు అమ్మి కడతానని చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా మరో సంచలన వ్యాఖ్ చేశారు జ్యో స్టార్స్ అధినేతలు. జీవిత చేతిలో రాజశేఖర్ కీలు బొమ్మ.. ఆమె ఏది చెబితే అది మాత్రమే చేస్తాడని అన్నారు. ఆమె చెప్పినట్లుగా అగ్రిమెంట్ పై సైన్ చేశారు రాజశేఖర్. ఆయన తల్లిదండ్రులు అంటే మాకు ఎంతో గౌరవం.. అందుకే ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టామని.. కానీ వీళ్లు మాత్రం దారుణంగా మోసం చేస్తున్నారని అన్నారు. అంతేకాదు డ్రగ్స్ కోసం ఆయన ఎక్కడికి వెళ్లేవాడో తెలుసని.. ఆమె తమ్ముడే డ్రగ్స్ ఇచ్చింది అన్ని అన్నారు. మేం మహనీయులమని సర్టిఫికెట్స్ ఇచ్చుకోవాల్సిన అసవరం మాకు లేదని అన్నారు జ్యో స్టార్స్ అధినేతలు.