పైన ఫొటోలో ముసి ముసి నవ్వులు చిందిస్తున్న బుడ్డదాన్ని చూశారా? ఎంతో క్యూట్ గా, చూడముచ్చటగా ఉంది కాదు. అంత బానే ఉంది కానీ.. ఇంతకి ఎవరీ పాప అనేది కాదా మీ ప్రశ్న. నవ్వులు ఒలికిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఓ భారీ మూవీలో నటిస్తోంది.
అసలు ఎంతకి ఎవరీ హీరోయిన్ అనేది కదా మీ ప్రశ్న. తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. ముద్దుగా ముద్దుగా నవ్వులు చిందిస్తున్న ఈ బుడ్డది ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్, నటి జీవిత దంపతుల కూతురే ఈ అమ్మాయి. ఈ ముద్దుగుమ్మ పేరు శివాత్మిక రాజశేఖర్. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి 2019లో దొరసాని సినిమాతో హీరోయిన్ గా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది.
ఇక నటిగానే కాకుండా.. ఈ హీరోయిన్ ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి వంటి సినిమాలను సైతం నిర్మించి నిర్మాతగానూ రాణిస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ చిత్రంలోనూ నటిస్తుంది. ఇక శివాత్మిక ఎంబీబీఎస్ పూర్తి చేయడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ ముద్దుగమ్మ మంచి నటిగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదగిపోవాలని మనం కూడా కోరుకుందాం.