ట్రిపులార్.. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన విషయం తెలసిందే. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రిపులార్ సినిమా క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వస్తోంది. హాలీవుడ్ అభిమానులు, డైరెక్టర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా మారిపోయాడు.
ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో వీడియోలు, వర్కింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కొమురం భీమ్ ఎంట్రీ సీన్ క్లిప్ ఒకటి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా ఇండియన్ సినిమాకి సంబంధించిన ఒక మూవీ క్లిప్ ట్విట్టర్ లో 10 మిలియన్ వ్యూస్ రాబట్టడం కూడా ఇదే ప్రథమం. ఇప్పుడు ట్రిపులార్ సినిమాకి సంబంధించిన మరో వీడియో క్లిప్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
అదేంటంటే.. ఢిల్లీ అడవుల్లో తెల్లదొరలపై యుద్ధం చేసేందుకు కొమురం భీమ్ జంతువులను బందించేవాడు. అందులో భాగంగా ఓసారి తోడేలును పట్టుకునేందుకు ఉచ్చు పన్నితే పెద్దపులి వస్తుంది. దానితో వీరోచితంగా పోరాడి కొమురం భీమ్ చివరికి బంధిస్తాడు. ఆ ఘర్షణలో భీమ్ ప్రాణం పోయినంత పనవుతుంది. ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించిన గ్రాఫిక్స్ బ్రేక్ డౌన్ వీడియో ట్రెండ్ అవుతోంది.
రాజమౌళి సినిమా అంటేనే గ్రఫిక్స్ మాయ, లేనిది ఉన్నట్లు చూపిస్తాడని తెలుసు. కానీ, అక్కడ పులి లేకపోయిన నిజమైన పులే ఉన్నట్లు చూపించడంపై ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా నిజమైన పులి ఉన్నట్లుగా ఊహించుకుని యాక్ట్ చేసిన తారక్ ను అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నిజమైన పులితో పోరాడుతున్నట్లు తారక్ చేసిన నటన ఆకట్టుకుందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ohhh yes! #RRRmovie Bheem introduction VFX before and after shots. https://t.co/bZPp6zNyX6
— Mayalu Mantralu (@MayaluMantralu) July 19, 2022