జూనియర్ ఎన్టీఆర్ గురించి, అతని నటన గురించి తెలుగు రాష్ట్రోల్లో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన నటనతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపులార్ సినిమాలో అయితే అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారనే చెప్పాలి. థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదల తర్వాత ట్రిపులార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ముఖ్యంగా తారక్ నటనకు ఫిదా అయిపోతున్నారు. ఇటీవల ఓ విదేశీ అభిమాని.. జంతువులతో కలిసి తారక్ వ్యాన్ లో నుంచి దూకే వీడియో క్లిప్ పోస్ట్ చేశాడు. అతను ఆ సీన్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. #RRRMovie and #NTR30 Billboard at Marriot Marquis in #NewYork, #USA #Bheem #NTRGoesGlobal@tarak9999 pic.twitter.com/aGMa1tsQQW — NandamuriFans.com (@Nandamurifansl) July 19, 2022 అయితే ఆ వీడియో క్లిప్ ని ఆస్కర్ విన్నింగ్ డైరెక్టర్ మాథ్యూ ఏ చెర్రీ రీ ట్వీట్ చేస్తూ.. ‘అంటే సూపర్ హీరో ల్యాండింగ్ కట్ చేయమంటావా’ అనే అర్థమొచ్చేలా ట్వీట్ చేశాడు. ఇంకేముంది ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఎంతలా అంటే ఆ క్లిప్ కి 10 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. ఓ భారతీయ సినిమా వీడియోకి ట్విట్టర్ లో 10 మిలియన్ వ్యూస్ రావడం ఇదే తొలిసారి. Craze beyond boundaries It's Bheem Supremacy!!@tarak9999 #NTRGoesGlobal pic.twitter.com/vkGGRrrv2S — Jr Ntr (@actorsTarak9999) July 20, 2022 అంతేకాదు ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ మాథ్యూ ఏ చెర్రీ ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతుండటం విశేషం. ఇంకా ఐపోలేదు.. ‘నెట్ ఫ్లిక్స్ నైజీరియా’ వారి అధికారిక ఖాతాలో మీకు నచ్చిన పాత్ర ఏది అంటూ హాలీవుడ్ తారల సరసన భీమ్ పాత్రను కూడా ఉంచింది. అక్కడి అభిమానులంతా భీమ్ పాత్రకు ఓట్లు వేశారు. అయితే మీకు నచ్చిన పాత్ర భీమ్ అనమాట అంటూ మరో ట్వీట్ చేశారు. Bheem went through a journey journey to get his sister back. https://t.co/CruZdxmi6t — Matthew A. Cherry (@MatthewACherry) July 19, 2022 ట్రిపులార్ సినిమాతో తారక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను, గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ట్విట్టర్ లో #NTRGoesGlobal అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు తారక్ నటన గురించి చెప్పాలంటే కొమురం భీముడో సాంగ్ ఒక్కటి చాలంటూ అభిమానులు, ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. తారక్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. "Bheem Entry Video" in 23 seconds #NTRGoesGlobal #NTR #NTR30 @NTRFanTrends @NTR2NTRFans pic.twitter.com/o4yJBoLhYE — Abhitosh Singh (@abhitoshsingh) July 20, 2022 ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం! వైద్యులు ఏం చెప్పారంటే? ఇదీ చదవండి: విషాదం.. ఆత్మహత్యకు పాల్పడిన పాపులర్ మోడల్!