JR NTR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్. ఈ సినిమా తాజాగా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమాకు సైన్ చేయలేదు. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా.. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పాండమిక్ టైంలో తన 30 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా మొదలుకాలేదు. అయితే, ఇన్ని రోజులు షూటింగ్, ప్రమోషన్లతో బిజీబిజీగా గడిపిన ఆయన గత కొద్దిరోజులనుంచి ఇంటికే పరిమితమయ్యారు. పెద్దగా బయటకు కూడా రావటంలేదు. ఇందుకు కారణం ఆయన ‘‘ఆంజనేయ స్వామి దీక్ష’’ తీసుకోవటమేనన్న ప్రచారం జరుగుతోంది.
జూ.ఎన్టీఆర్ మొట్టమొదటి సారి ‘ఆంజనేయ స్వామి దీక్ష’ చేపట్టారని సమాచారం. ఈ దీక్ష 21 రోజుల పాటు ఉండనుందంట. మరి ఎన్టీఆర్ ఎందుకు ఈ దీక్ష చేపట్టారు?.. దీక్ష వెనుక కారణం ఏంటి? అన్నది తెలియరాలేదు. ఎన్టీఆర్ స్నేహితుడు రామ్ చరణ్ ప్రతీ ఏటా అయ్యప్ప మాల వేస్తుంటారు. మొన్నీమధ్య ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన ఈవెంట్లలో కూడా దీక్ష దుస్తులతో దర్శనమిచ్చారు. జూ. ఎన్టీఆర్ ఆంజనేయస్వామి దీక్ష వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఈ ఫొటోలోని స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.