ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా 'సలార్'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. పైగా ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ ఉండేసరికి ఆ ఎక్సయిట్ మెంట్ ని తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ సలార్ రిలీజ్ కి ఎంత టైమ్ ఉందో.. అన్ని రోజులను ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్స్ ద్వారా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. సలార్ మూవీ.. ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో భాగంగా రాబోతుంది. ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సందడి చేశాయి. పైగా సలార్ సినిమా కూడా కేజీఎఫ్ లో భాగస్వామ్యం కానుందనే కోవలో రెడీ అవుతుండటం విశేషం.
ఇదిలా ఉండగా.. నీల్ వర్స్ లోకి ఇంకా చాలామంది స్టార్స్ రాబోతున్నారట. ప్రస్తుతానికి ప్రభాస్ సలార్ రూపంలో సాలిడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేశాయి. ఫ్యాన్స్ కూడా సందడి మొదలు పెట్టేశారు. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సలార్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అది ‘NTR31’గా తెరకెక్కనుంది. ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. సలార్ సినిమాలో కేజీఎఫ్ హీరో యష్, జూనియర్ ఎన్టీఆర్ భాగస్వామ్యం కాబోతున్నారని టాక్ మొదలైంది. అవును.. ఈ సినిమాలో యష్ ఓ కీలక పాత్ర ద్వారా కేమియో రోల్ లో వచ్చి వెళ్లాడని.. ఎన్టీఆర్ మాత్రం క్లైమాక్స్ లో వాయిస్ ఓవర్ ద్వారా ఎంట్రీ ఇస్తాడని వినికిడి. అంతేగాక నీల్ ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాకి లీడ్ కూడా ఇందులోనే ఉండబోతుందని అంటున్నారు. సో.. రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. కానీ.. సినిమా రిలీజ్ అయ్యాకే నిజం తెలియనుంది. కాబట్టి.. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ నుండి ముందుగా ఆదిపురుష్ రిలీజ్ కాబోతుంది. మరి సలార్ సినిమాపై అంచనాలు, అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో తెలపండి.