దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రంతో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. RRR మూవీ బ్లాక్ బస్టర్ తరువాత యన్టీర్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఇటీవలె తన బర్త్ డే సందర్భంగా రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి. kGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ నటించనున్నాడు. కొరటాల దర్శకత్వంలో మూవీ ముందుగా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఆ తరువతా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యన్టీఆర్ మూవీ పట్టాలెక్కనుంది.
అయితే తాజాగా యన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న మూవికి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిల్ ను ఖరారు చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అసురు అనే పిలుపులోనే ఓ పవర్ ఉందని, ఇది యన్టీఆర్ కి కరెక్ట్ గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారంట. గతంలోనే రిలీజ్ అయిన NTR31 మూవీ పోస్టర్ లో యన్టీర్ ఊర మాస్ లుక్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ లుక్, గెటప్ కు అసురు అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుందని ఆయన అభిమానులు అంటున్నారు.
ఇదీ చదవండి: Jr.NTR తో విబేధాలపై స్పందించిన తారకరత్న! ఫ్యామిలీ అంతా కలిసి..!హీరోను ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ స్టైలే వేరు. KGF-1,2 సినిమాలతో అది ఫ్రూవ్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ మూవీ షూటింగ్ లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తైన తరువాత యన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. ఇంతలోనే యన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ రానున్న సినిమా టైటిల్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి.. ఈవార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.