మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబర్ 10న హైదరాబాద్ లో జరగనున్నాయి.. ఈ సందర్బంగా సెప్టెంబర్ 27న ఫిల్మ్ ఛాంబర్ మా కార్యాలయంలో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ సందర్బంగా మాట్లాడిన నటి జీవిత నటుడు పృథ్విపై హాట్ కామెంట్స్ చేసింది. పృథ్వి ఆరోపణలు చాలా చిన్న పిల్లల వ్యవహారం లాగా అనిపించిందని, ఆ వ్యాఖ్యలతో నేను చాలా ఇబ్బంది పడ్డాను అన్నారు జీవిత రాజశేఖర్.
నేను అసోసియేషన్ కి శక్తి వంచన లేకుండా చేశానని, మువి ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే తలెత్తుకు తిరిగేలా వుండాలని ఆమె అన్నారు. ఇక మంచి వాతావరణం లో ఒకరిని ఒకరు కించ పరుచుకోకాకుండా ఎన్నికలు జరగాలని, అన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నట్టు ఇక్కడ కూడా జరుగుతున్నాయి అంటూ జీవిత చెప్పుకొచ్చారు. ఇక ప్రకాష్ రాజ్ అజెండాలో ఏమి చెప్పారో అవి చేసేందుకు పూర్తి స్ప్రష్ట్ట వుందని జీవిత స్పష్టం చేశారు.
ఇక గెలిచిన ఓడినా ఈ ఇండస్ట్రీ లోనే పని చేయాలని ఎన్నికలప్పుడు సహజంగా పోటీ వుంటుందని విష్ణు మోహన్ బాబు సన్ అవ్వడం వల్ల మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి లాగా చూస్తున్నారని జీవిత అన్నారు. ఇర ఇదే కాకుండా చిరంజీవి గారు ఎక్కడ మాకు సపోర్ట్ అని చెప్పలేదు. చిరంజీవి అందరివాడు.ఇండస్ట్రీ వాళ్లకు చిరంజీవి ఆశీస్సులు వుంటాయన్నారు. ఈ రోజు ప్రకాశ్ రాజ్ గారి ప్యానెల్ అంతా నామినేషన్ వేశాము. సాధారణ ఎన్నిక లు లాగా జరుగుతున్నాయి. దీంతో ఏమి జరిగినా సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలినేనని చాలా హెల్డిగా ఈ ఎన్నికలు జరగాలి అంటూ జీవిత తెలిపారు.
ఇక ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుండా దిగ్నిఫైడ్ గా జరగాలని జీవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..”ఇవి ఎన్నికలు కాదు పోటీ. ప్రతి విషయంలో మేం ఒక అడుగు ముందే ఉన్నాం. గెలిపించేది, ఓడించేది ఓటర్ల బాధ్యత అంటూ ప్రకాష్ తెలిపారు. ఇకసవ్యంగా దూషారోపణ చేయకుండా ఎన్నికలు జరగాలని, ఇవాళ నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 3న మా ఎన్నికల ప్రణాళికను, మా అజెండాను వెల్లడిస్తానని. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు. దేశం కోసం పోరాడుతున్నారు. మా ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు. పవన్ కూడా మా మెంబర్.. తను అందరికీ మంచే చేస్తాడు అంటూ ప్రకాష్ తెలిపారు.