టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బెడ్ పై పడుకుని పృథ్వీరాజ్ ఒక వీడియో బైట్ కూడా రిలీజ్ చేశారు.
టాలీవుడ్ లో ఉన్న కమెడియన్లలో పృథ్వీరాజ్ కి ప్రత్యేక స్థానం ఉంది. 30 ఇంయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతోగానే అలరించారు. ఆ డైలాగ్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కమెడియన్ గా, నటుడిగా పృథ్వీ రాజ్ ఎంతో సాధించారు. ఇప్పుడు డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకునేందుకు కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ పనుల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. పృథ్వీకి సెలైన్ కూడా పెట్టారు. సెలైన్ పెట్టుకుని.. అలా బెడ్ పైనుంచే ఒక చిన్న వీడియో బైట్ రిలీజ్ చేశారు.
“డైరెక్టర్ గా తొలిసారి సినిమా తీయబోతున్నాను. కొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి. 26న ఇంకా పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. ఇలా అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నాను. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకి, మా టీమ్ కి మీ అందరి సపోర్ట్ ఉండాలి” అంటూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. అయితే ఏం జరిగింది? ఆయన ఏ అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా పృథ్వీని అలా ఆస్పత్రిలో చూడగానే అభిమానులు కంగారు పడ్డారు. అయితే పృథ్వీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది.
#30YearsIndustry #Pruthviraj #hospitalized #Tollywood pic.twitter.com/UbnZfYJBP0
— Tirumalasetty Tirupathirao (@tiru9676) May 9, 2023