థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కూతురు శ్రీలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. ఆ సినిమా త్వరలో విడుదల కానుంది.
‘ థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఇక్కడ’ అన్న డైలాగ్ వినపడగానే ఠక్కున గుర్తొచ్చే పేరు పృథ్వీరాజ్. ఆ డైలాగ్‌కు తగ్గట్లుగానే ఆయన తెలుగు పరిశ్రమలో దాదాపు 30 ఏళ్ల నుంచి నటుడిగా రానిస్తున్నారు. కొన్ని వందల సినిమాల్లో నటించారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో కాంట్రవర్సీలకు సైతం గురయ్యారు. కమెడియన్‌గా బాగా రానిస్తున్న సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైఎస్సార్ సీపీలో చేరి టీటీడీలో ఓ కీలక పదవిని చేపట్టారు. ఒకరకంగా సినిమాలకు దూరం అయ్యారు.
వివాదాల కారణంగా పదవికి, పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. అంతేకాదు! తన కూతురు శ్రీలుకు సినిమా మీద ఉన్న ప్యాషన్‌ను గుర్తించి ఆమెను ప్రోత్సహించారు. కుమార్తెను పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించారు. స్వయంగా ఆయనే ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమాకు దర్శకత్వం వహించటంతో పాటు నిర్మించారు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శ్రీలు సినిమా ప్రమోషన్‌లలో బిజీ అయిపోయారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శ్రీలు మాట్లాడుతూ.. ‘‘ మా డాడీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీ పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం లేదు. నాకు రాజకీయాలంటే ఇంట్రస్ట్ లేదు. మేము సినిమా ఇండస్ట్రీలో హ్యాపీగా ఉన్నాం. డాడీకి చిన్నప్పటినుంచి పాలిటిక్స్ అంటే ఇష్టం. నేను దాన్ని ఆపలేను. నేను ఆయనను వద్దని వారించలేదు. ఆయన నటనకు సంబంధించి అన్ని విషయాలు నాకు ఇష్టమే.. కానీ, ఆయన పాలిటిక్స్ నాకు నచ్చవు’’ అని అన్నారు. మరి, తండ్రి రాజకీయాలు తనకు నచ్చవని అంటున్న శ్రీలుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.