'30 ఇయర్స్ పృథ్వీ' మరోసారి న్యూస్ లో నిలిచాడు. కాకపోతే ఈసారి పెద్దగా కాంట్రవర్సీలు ఏం లేవు. జస్ట్ ఆ నటితో డ్యాన్స్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మరింది.
30 ఇయర్స్ పృథ్వీ పేరు చెప్పగానే టాలీవుడ్ లో అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. కెరీర్ స్టార్టింగ్ లో ఛాన్సులు పరంగా ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తర్వాత కాస్త కుదురుకున్నాడు. విలన్ తరహా రోల్స్ చాలా చేశాడు. అయితే గత కొన్నేళ్ల నుంచి మాత్రం పూర్తిగా రూట్ మార్చేశాడు. కామెడీ తరహా రోల్స్ ఎడాపెడా చేస్తూ వెళ్లాడు. ఫేమ్ కూడా చాలానే సంపాదించాడు. SVBC బోర్డ్ ఛైర్మన్ గానూ కొన్నాళ్లపాటు ఉన్నాడు. అయితే ఓ ఆడియో లీక్ వివాదంలో చిక్కుకోవడంతో.. ఆ పదవికి రాజీనామా చేసే బయటకొచ్చేశాడు. ఆ తర్వాత నుంచి పెద్దగా బయట కనిపించడం లేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్స్, యాక్టర్స్ అప్పుడప్పుడు.. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’తోపాటు పలు రియాలిటీ షోల్లో కనిపిస్తున్నారు. కొన్నిసార్లు స్టేజీపై ఫెర్ఫార్మ్ చేస్తే.. మరికొన్నిసార్లు జడ్జిలుగా అలరిస్తున్నారు. అలా బుల్లితెర కమెడియన్స్, నటీనటులతో బాండింగ్ పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడంతా ఇన్ స్టా రీల్స్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి.. వాళ్లతో రీల్స్ కూడా చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. అలా ’30 ఇయర్స్ పృథ్వీ’.. జబర్దస్త్ తన్మయితో చేసిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో భాగంగా.. ‘మాస్టారూ మాస్టారూ నా మనసుని గెలిచారు’ అని పాట ప్లే అవుతుండగా, దానికి లిప్ సింక్ ఇస్తూ పృథ్వీ, తన్మయి కలిసి డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ కాస్త నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేస్తోంది. కొందరైతే పృథ్వీపై కామెంట్స్ పెడుతూ రెచ్చిపోతున్నారు. అవన్నీ కూడా ఫన్నీగా ఉంటూ వీడియో చూస్తున్న, కామెంట్స్ చదువుతున్నవాళ్లకు మంచిగా అలరిస్తున్నాయి. మరి 30 ఇయర్స్ పృథ్వీ, జబర్దస్త్ తన్మయి చేసిన డ్యాన్స్ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.