జాన్వీ కపూర్.. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చమటలు పట్టిస్తుంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ విషయంలో అచ్చం తన తల్లి శ్రీదేవినే ఫాలో అవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ సోయగం జాన్వీ కపూర్. తనదైన కథల ఎంపికతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇక ఈ అమ్మడు త్వరలోనే ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఓ విషయంలో జాన్వీ అచ్చం తన తల్లినే ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఏ విషయంలో శ్రీదేవిని జాన్వీ ఫాలో అవుతుందో ఇప్పుడు చూద్దాం.
జాన్వీ కపూర్.. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చమటలు పట్టిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో తన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. నెపోకిడ్ అన్న వ్యాఖ్యలపై ఆ మధ్య కాస్త ఘాటుగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా జాన్వీ కపూర్ కు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం NTR30. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ఈ సినిమాతో నే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది జాన్వీ ముద్దుగుమ్మ. అందుకోసం భారీగా రెమ్మూనరేషన్ అందుకుంటోందంట జాన్వీ. దాదాపు 4 కోట్ల పారితోషికాన్ని ఈ మూవీకి గాను జాన్వీ తీసుకుంటున్నట్లు సమాచారం. అదీకాక తన వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా భరించాలని చెప్పిందట. ముందుగా 5 కోట్లు డిమాండ్ చేసిందట ఈ భామ. అయితే మేకర్స్ మాత్రం 4 కోట్లు ఇచ్చి సిబ్బంది ఖర్చులను భరిస్తామని చెప్పడంతో మూవీకి ఓకే చేసిందట జాన్వీ. ఇక ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దాంతో లేతగా కనిపించే జాన్వీ ఇంత ముదురా అనుకుంటున్నారు నెటిజన్స్. అయితే రెమ్యునరేషన్ విషయంలో శ్రీదేవి కూడా ఇలాగే వ్యవహరించేదని సమాచారం.
గతంలో శ్రీదేవిని బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు సంప్రదించారు. అయితే అంతా ఓకే అయిన తర్వాత తనతో వచ్చే దాదాపు 15 మంది సిబ్బందికి హోటల్ రూమ్స్, ఖర్చులను భరించాలని కండిషన్ పెట్టిందట. దాంతో రాజమౌళి వెనక్కి తగ్గి ఆ పాత్రకోసం రమ్యకృష్ణను ఫైనల్ చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్న జాన్వీకి.. తన డిమాండ్స్ కారణంగానే అవకాశాలు రావట్లేదని ఇండస్ట్రీలో టాక్. మరి రెమ్యూనరేషన్ విషయంలో జాన్వీ అనుసరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.