సెలబ్రిటీల గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులలో, అభిమానులలో ఎల్లప్పుడూ ఉంటుంది. కొందరు సినిమాలు, సీరియల్స్ చూసి వినోదం పొందుతుంటారు. కానీ.. అభిమానులు మాత్రం తమ ఫేవరేట్ సెలబ్రిటీల గురించి కొత్త విషయాలు తెలుసుకోవడంలోనే కిక్కు ఉందంటారు. అందుకే సెలబ్రిటీస్ నుండి ఎలాంటి అప్ డేట్స్ వచ్చినా.. వెంటనే షేర్ చేసి.. వైరల్ చేసేస్తుంటారు.
బాల నటిగా ప్రయాణం మొదలు పెట్టి, అగ్ర హీరోలందరి సరసన నటించి, అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. అందం, అమాయకత్వం కలగలపిన నటి ఆమె. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా శ్రీదేవి సొంతం. బాలీవుడ్ టూ మాలీవుడ్ వరకూ ఓ శకం పాటు సినీ పరిశ్రమను ఏలిన రారాణి. అగ్ర హీరోలందరి సరసన జతకట్టి మూడు దశాబ్దాల పాటు తిరుగులేని హీరోయిన్‌గా నిలిచారు. పెళ్లి తర్వాత 15 సంవత్సరాల పాటు సినిమాలకు దూరమై.. తిరిగి […]