రాజమనార్ వచ్చేశాడు… నోట్లో చుట్ట, ముక్కుకు రింగ్‌తో మాస్కే మాస్‌గా ఓ రేంజ్లో ఉంది లుక్. ఎవరనుకుంటున్నారా? అదే, మన జగ్గూభాయ్ అండి. సలార్‌లో జగపతిబాబు ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ విడుదల చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికేశాడు అన్న అభిమానుల ఆశలు ఏమాత్రం తగ్గకుండా జగపతిబాబు సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అందరూ రాజమనార్ పాత్ర మనోజ్‌బాజ్‌పాయ్ చేస్తున్నాడని టాక్ నడిచింది. జగ్గూభాయ్‌ని చూడగానే అభిమానులు ఒకింత షాక్‌కు, ఆనందానికి గురవుతున్నారు. ప్రభాస్, జగపతిబాబు కాంబో అదిరిపోతుందంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.
ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా సలార్‌ను ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అభిమానుల్లో ఒకింత అనుమానం మొదలైంది. గతంలో సలార్ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్-2’ ఏప్రిల్ 14న విడుదల కానున్నట్లు ప్రకటించారు. దీంతో, అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఒకే రోజు ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహించిన రెండు సినిమాలు విడుదల చేస్తారా? లేక, ‘సలార్’ సినిమాని వాయిదా వేస్తారా? అని.