ఏపీ మంత్రవర్గ విస్తరణలో భాగంగా కొత్తగా 15 మందికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రిగా అవకాశం కల్పించారు. తాజా మంత్రివర్గ విస్తరణలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కూడా మంత్రి పదవి దక్కడం విశేషం. అయితే ఈ నేపథ్యంలో ఇక నుంచి రోజా జబర్దస్త్ షోకు, సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: మంత్రి పదవి ఎఫెక్ట్.. MLA రోజా షాకింగ్ నిర్ణయం!
ఇందులో భాగంగానే జబర్దస్త్ కంటెస్టెంట్ వర్ష తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో.. ఐయామ్ సో హ్యాపీ.. ఐ మిస్ అమ్మ అంటూ కన్నీటి పర్యంతమవుతూ రోజాను హగ్ చేసుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. దీంతో నిజంగానే రోజా ఇక నుంచి జబర్దస్త్ షోలో కనిపించదని మాత్రం గట్టిగా తెలుస్తోంది. తాజాగా వర్ష పోస్ట్ చేసిన ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.