నగరిలో మాజీ మంత్రి నారా లోకేష్, మంత్రి ఆర్కే రోజా మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజూకు ముదురుతుంది. తాజాగా మరోసారి లోకేశ్ పై మంత్రి రోజా హట్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. ప్రాంతానికో రాజకీయ రగడ అన్నట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. ఇటీవలే నెల్లూరు కేంద్రం సింహపురి రాజకీయం హాట్ హాట్ గా జరిగింది. అలానే తాడిపత్రి కేంద్రంగా కూడా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతుంది. ఈక్రమంలో ఇటీవలే నగరి కేంద్రంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేశ్, మంత్రి ఆర్కే రోజా మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా నగరిలో ఆర్కే రోజా పై లోకేశ్ సంచలన కామెంట్స్ చేశారు. డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ రోజాపై కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి రోజా కూడా తీవ్ర స్థాయిలో లోకేశ్ పై విరుచక పడింది.
నగరి నియోజకవర్గంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఇటీవలే లోకేశ్ పై ఓ రేంజ్ లో విరుచుకపడ్డ రోజా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. లోకేశ్ కి ఏ రంగు చీర కావాలో ఏ టైపు కావాలో చెబితే పంపిస్తానని రోజా అన్నారు. బెనారస్ కావాలో, ఉప్పాడ కావాలో లోకేశ్ చెప్పాలన్ని రోజా తెలిపారు. నా ఇంటి ముందు గాజులు పగలగొట్టించడానికి లోకేష్ కి ఎంత ధైర్యమని, లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని, ఓ శుంఠ అని రోజా అన్నారు. నక్క వాతలు పెట్టుకున్నట్లు జగన్ చూసి పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతావా అంటూ ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్రకు తమిళనాడు, కర్ణాటక నుంచి అద్దెకు మనుషులను తెచ్చుకుంటున్నారని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. “అవునూ నా కుటుంబానికి నేనే డైమండ్ పాపను” అంటూ రోజా లోకేశ్ కి కౌంటర్ ఇచ్చారు.
గురువారం నగరిలో మంత్రి రోజా పర్యటించారు. ఈ సందర్భంగా లోకేశ్ పై ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ..” లోకేశ్ ఒక వెంటకారపు, పనికిమాలిన మనిషి. అతని పాదయాత్ర మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చేసింది జీరో మాత్రమే. తన కోసం వచ్చిన తారకత్న గుండెపోటుకు గురై.. ఆస్పత్రి పాలైతే.. కనీసం తిరిగి కూడా చూడకుండా, బాధలేకుండా సంతోషంగా పూలు దండలు వేయించుకుంటూ ఎలా పాదయాత్ర చేశాడో అందరం చూశాం. సొంత కుటుంబ సభ్యుడికే ఏదైనా జరిగితే పట్టించుకోని వ్యక్తి, రేపు అధికారంలోకి వస్తే మనకి ఏమి చేస్తాడు అనే సందేహం ప్రజల్లో కలిగింది. అందుకే పాదయాత్రకు ప్రజలు ఎవరూ రావడం లేదు. 20 గంటల పాటు టెంటులో దాక్కుని జనాన్ని బలవంతంగా లాక్కొస్తున్నా.. రాని పరిస్థితిలో ఆయన సభలు జరుగుతున్నాయి అంటూ రోజా ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరి.. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.