నటి రోజా తెలుగు, తమిళ అగ్రహీరోల సరసన నటించిన సంగతి విదితమే. మొన్నటి వరకు ప్రముఖ టీవీషో జబర్థస్త్ జడ్జిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఏపీ మంత్రిగా, నేతగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆమె...
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, వైసీపీ నేత, నటి రోజా అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి ఆమెకు కాలు వాయడంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాలినొప్పి, వాపుతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని థౌజెండ్ లైట్స్‌లోగల అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఇటీవలే ఆమె చెన్నైకి వెళ్లగా.. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. రోజాకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందని, వాపు కూడా తగ్గిందని డాక్టర్లు వెల్లడించినట్లు సమాచారం.
త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆసుపత్రిలో చేరారన్న వార్త రావడంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని పేర్కొంటున్నారు. వైసీపీలో కీలక నేత అయిన ఆమె ఏడాది క్రితం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. జగన్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తే.. వాటిని తిప్పుకొడుతూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు మంత్రి. ఆమె తెలుగు, తమిళ అగ్రహీరోల సరసన నటించిన సంగతి విదితమే. మొన్నటి వరకు ప్రముఖ టీవీషో జబర్థస్త్ జడ్జిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం మంత్రిగా, వైసీపీ నేతగా ప్రజల్లో తిరుగుతూ.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.