జబర్దస్త్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఎంపికయ్యారు. పంచులతో పిల్లలను, పెద్దలను కితకితలు పెట్టించిన నటుడు ఇప్పుడు పాఠాలతో పిల్లలకు చక్కని భవిష్యత్తు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఒక సుకుమార్, ఒక బ్రహ్మానందం ఇలా కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉండి.. ఆ తర్వాత సినిమాల మీద మక్కువతో సినీ రంగంలో అడుగు పెట్టారు. అయితే ఒక నటుడు మాత్రం అందుకు భిన్నంగా సినిమాలు, కామెడీ స్కిట్లు చేసి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా జాయిన్ అయ్యారు. అవకాశాలు లేక కాదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పాలన్నది అతని కల. ఒకటి, రెండేళ్లు కాదు 25 ఏళ్ల కల అది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేయాలి అని 25 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆయన కల ఫలించింది. ఆ నటుడు మరెవరో కాదు, జబర్దస్త్ ద్వారా సుపరిచితుడైన కమెడియన్ గణపతి.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట వారి వీధికి చెందిన గణపతి జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో కితకితలు పెట్టించారు. పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన గణపతికి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా సేవలందించాలనేది అతని కల. ఎట్టకేలకు ఆ కల నెరవేరింది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్-విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేసేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.
1998లో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులను పలు జిల్లాల్లో టీచర్ గా నియమించింది. గత నెల 15న ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం డీఎస్సీ పరీక్షల్లో అర్హత కలిగిన అభ్యర్థులను కాంట్రాక్ట్ బేస్డ్ మీద నియమించింది. ఈ అభ్యర్థులలో జబర్దస్త్ నటుడు గణపతి కూడా ఉన్నారు.1998 డీఎస్సీకి ఎంపికైన గణపతి ఆముదాలవలస మండలం సంత కొత్తవలస గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ఇన్నాళ్లకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలన్న తన కోరిక నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మరి హాస్యనటుడిగా మనల్ని నవ్వించిన జబర్దస్త్ గణపతి ఇప్పుడు ప్రభుత్వ టీచర్ గా చేరిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేయండి.
1998 డీఎస్సీ కు ఎంపికైన జబర్దస్త్ నటుడు గణపతి👍👍
సీఎం జగన్ గారి నిర్ణయంతో👌👌 ఉపాధ్యాయుడిగా మారిన జబర్దస్త్ కమెడియన్👍👍@ANR1929@YSRCParty@IVBRC_RAO#FFF#DSC pic.twitter.com/NdVTujhDmc
— PARAKALA RAJA GOPALA PATTABHI RAMAIAH (@parakalargprama) April 13, 2023