తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బుల్లితెర కామెడీ షోలలో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఒకటి. గత కొన్నేళ్లుగా విజయవంతంగా ఆకట్టుకుంటున్న ఈ షోలో రష్మీ గౌతమ్ యాంకర్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో మొన్నటివరకూ జడ్జిలుగా వ్యవహరించిన నటి రోజా.. సింగర్ మనో స్థానాలలో ప్రస్తుతం నటి పూర్ణ, ఇంద్రజ కొనసాగుతున్నారు. ఒకప్పుడు నాగబాబు, నటి రోజా జడ్జిలుగా ఎంత సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు పూర్ణ, ఇంద్రజ ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటారో చూడాలి.
ఈ క్రమంలో తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ప్రోమో మొదటి నుండి చివరి అదిరిపోయే పంచులతో ఆకట్టుకుంది. మధ్యలో సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్ తో పాటు, బులెట్ భాస్కర్ – ఇమ్మాన్యుయేల్ స్కిట్ కూడా హిలేరియస్ గా సాగింది. అయితే.. వర్షతో స్కిట్ చేసే సమయంలో ఇమ్మాన్యుయేల్ జడ్జిలుగా ఉన్న పూర్ణ, ఇంద్రజలపై సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది.
ఇదివరకు వర్షను హేళన చేస్తూ.. అమ్మాయిని అబ్బాయి అంటూ పంచులు వేయకూడదని చెప్పిన సంగతి తెలిసిందే. వర్షను అబ్బాయితో పోలుస్తూ పంచులు వేసినందుకు కొన్నిసార్లు చాలా బాధపడింది. మళ్లీ ఇలాంటి పంచులు రిపీట్ కాకూడదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. తాజా ప్రోమోలో భాస్కర్ జోడిగా ఉన్న ఫైమా.. ఇమ్మానుయేల్ ని అమ్మాయితో పోల్చడంతో జడ్జిలుగా ఉన్నటువంటి పూర్ణ, ఇంద్రజ ఫక్కున నవ్వేశారు. వెంటనే ఇమ్మాన్యుయేల్ స్పందిస్తూ.. “ఏవండీ! అమ్మాయిని పట్టుకొని అబ్బాయి అనకూడదు అన్నారు. మరి అబ్బాయిని పట్టుకొని అమ్మాయంటే ఎలా నవ్వుతారండీ?” అని గట్టిగా అడిగాడు. దీంతో పూర్ణ, ఇంద్రజ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.