బుల్లెట్ భాస్కర్.. జబర్దస్త్ తో కెరీర్ మొదలు పెట్టి టీమ్ లీడర్‌గా, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కొనసాగుతున్నాడు. ఈ మధ్యకాలంలో బుల్లెట్ భాస్కర్ కంటే అతని ఫాదర్ అప్పారావు బాగా ఫేమస్ అయ్యారు. మల్లెమాల నిర్వహించిన ఫాదర్స్ డే స్పెషల్ ఈవెంట్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన అప్పారావు ఆ తర్వాత ప్రతి స్పెషల్ ఈవెంట్ లో కనిపిస్తున్నారు. తాజాగా ‘మా నాన్నకు పెళ్లి’ అంటూ ఒక ప్రత్యేక ఎపిసోడ్ కూడా చేశారు. భాస్కర్ కంటే ప్రస్తుతం అప్పారావు ఎక్కువ ఫేమస్ అయిపోతున్నారు. బుల్లెట్ భాస్కర్- అప్పారావుని సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది.
ఇదీ చదవండి: వీడియో: తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరో బయటపెట్టిన శ్రీముఖి!
ఆ ఇంటర్వ్యూలో అప్పారావు పంచ్ ల వర్షం కురిపించారు. భాస్కర్ ని కూడా మాట్లాడనివ్వకుండా మొత్తం ఆయనే పంచ్ ల మీద పంచులు వేశారు. ఏదైనా గిఫ్ట్ ఇస్తాడా అని అడిగిన ప్రశ్నకు.. నెల నెలా ఒక ఫుల్ బాటిల్ ఇస్తాడని చెప్పుకొచ్చారు. అయితే ఆ సందర్భంలోనే ఏపీలో మందు బాగోలేదని.. కామెంట్ చేశారు. అప్పుడు భాస్కర్ అలాంటివి ఇక్కడ చెప్పకూడదని వారించినా.. ఉన్నదేగా చెప్పాను అంటూ నవ్వులు పూయించారు. దాపరికం లేకుండా స్వచ్ఛంగా ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. ఆ స్పెషల్ ఇంటర్వ్యూ మీరూ చూసేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.