ఇటీవల కాలంలో చిత్రపరిశ్రమ ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ ని కోల్పోయింది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు దిగ్గజ నటీనటులతో పాటు గొప్ప టెక్నీషియన్స్ కూడా ఇండస్ట్రీకి దూరమయ్యారు. 2022 మిగిల్చిన విషాదం నుండి తేరుకునేలోపే 2023 ఆరంభంలో ప్రపంచస్థాయిలో గొప్ప అందగత్తెగా ప్రసిద్ధి చెందిన నటి కన్నుమూయడం బాధాకరం. వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిగా గుర్తింపు పొందిన నటి జినా లొలోబ్రీగిడా కన్నుమూశారు. ఇటాలియన్ కి చెందిన జినా.. జనవరి 16న తన తొంబై ఐదేళ్ల వయసులో మరణించారు. జినా మరణవార్తను టుస్కానీ గవర్నర్ యుజెనియో గియాని అఫిషియల్ గా ప్రకటించారు.
మరి జినా లొలోబ్రీగిడా.. మరణానికి గల కారణం ఏంటనేది వెల్లడించలేదు. కానీ.. ఆమెకు సంతాపం తెలుపుతూ అసలు విషయాన్నీ తెలిపేసరికి.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. 1927 జూలై 4న ఇటలీలోని సుబియాకో సిటీలో జినా జన్మించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించిన జినా.. తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోకుండా హాలీవుడ్ లో అడుగుపెట్టింది. హాలీవుడ్ లో క్రాస్డ్ స్వోర్డ్స్, ది హంచ్‌బ్యాక్ ఆఫ్ నోట్రే డామ్, బ్యూటిఫుల్ బట్ డేంజరస్ లాంటి పాపులర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.
హీరోయిన్ గా కెరీర్ లో ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్ సరసన నటించిన జినా లొలోబ్రీగిడా.. దాదాపు 33 ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ BAFTA అవార్డుకు ఈమె పేరును నామినేట్ చేయడం కూడా విశేషం. అదీగాక 2018లో ‘వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ అవార్డును అందుకున్నారు. కెరీర్ లో హంఫ్రీ బోగార్ట్, ఫ్రాంక్ సినాట్రా, రాక్ హడ్సన్, ఎర్రోల్ ఫ్లిన్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు జినా. పర్సనల్ లైఫ్ లో.. 20 ఏళ్లకే స్లోవేనియన్ డాక్టర్ పెళ్లి చేసుకుంది జినా. ఓ కొడుకు పుట్టాక భర్తతో విడిపోయింది. తర్వాత ఇటాలియన్ రాజకీయాల్లో కూడా రాణించాలని ప్రయత్నాలు చేసి ఓటమిని చవిచూసింది. అనంతరం 2006(79 ఏళ్ళ వయసు)లో తనకంటే 34 ఏళ్ళు చిన్నవాడైన స్పానిష్ నటుడిని పెళ్లాడింది. కానీ.. ఏడాదికే వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుండి పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం ఓ చర్చిలో జినా అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.
Farwell to the Italian screen goddess and one of the biggest stars of European cinema in the 1950s and 60s, the legendary Gina Lollobrigida, who passed away at the age of 95. R.I.P. pic.twitter.com/WiQELxQf6T
— Remembering Dame Angela Lansbury 🇺🇦 (@_AngelaLansbury) January 16, 2023
R.I.P. Italian actress Gina Lollobrigida, she was 95 years old. She was absolutely stunning as Esméralda in The Hunchback of Notre Dame 1956. pic.twitter.com/b8KkMoBZJT
— Masquerade (@Masquerade2376) January 16, 2023
RIP Gina Lollobrigida, whom it was said “She makes Marilyn Monroe look like Shirley Temple” has passed away at 95. So many great films. Ciao, Lolo. pic.twitter.com/QnJoJVTkKT
— Shae Roberts 🌊 (@shaedreams1) January 16, 2023