ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించి పన్ను ఎగవేశారు అన్న ఆరోపణలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఐటీ దాడులు చేశారు అధికారులు. అయితే ఈ రైడ్స్ జరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏవైనా పెద్ద సినిమాలు విడుదల అయితే.. ఆ సినిమాకు సంబంధించిన నిర్మాణ సంస్థలపై ఐటీ రైడ్స్ జరగడం సర్వసాధారణమై విషయమే. తాజాగా మరోసారి టాలీవుడ్ ఐటీ రైడ్స్ తో ఉలిక్కిపడింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించి పన్ను ఎగవేశారు అన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ కారణాలతో పాటుగా ఈ రైడ్స్ జరగడానికి వేరే రీజన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మైత్రీ మూవీ మేకర్స్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే భారీ చిత్రాలు నిర్మించే సంస్థగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ.. విజయాలు సాధిస్తోంది ఈ నిర్మాణ సంస్థ. ఇక టాలీవుడ్ లో అతిపెద్ద నిర్మాణ సంస్థగా అవతరించిన మైత్రీ మూవీ మేకర్స్ పై తాజాగా జరుగుతున్న ఈ దాడులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ దాడులకు ప్రధాన కారణం.. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న చిత్రాలకు పెట్టుబడులు ఇతర దేశాల నుంచి వస్తున్నాయి అన్న ఆరోపణలు రావడమే. దాంతో బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ దాడులు జరిగాయి.
అదీకాక ఈ సంస్థ ద్వారా ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అక్రమ సంపాదనను సినిమాల్లో పెడుతున్నారు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు తెలంగాణ వారు అయితే.. మరోకరు ఏపీ ఎమ్మెల్యే అని సమాచారం. మైత్రీ సంస్థలో మనీలాండరింగ్ జరుగుతోంది అన్న అనుమానం తోనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి రైడ్స్ సాధారణమని వారు చెప్పుకొచ్చారు. ఇక 2015లో ఈ సంస్థను స్థాపించగా.. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది. దాంతో టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థగా పేరుతెచ్చుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంటి పై కూడా దాడులు నిర్వహించారు ఇన్ కమ్ టాక్స్ అధికారులు. సుకుమార్ మైత్రీ నిర్మాణంలో పుష్ప, పుష్ప2 చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ మధ్య కాలంలో నిర్మాణ రంగంలో కి కూడా అడుగుపెట్టాడు ఈ క్రియేటీవ్ డైరెక్టర్. దాంతో సుకుమార్ కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో వారు ఈ రైడ్స్ జరిపారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల విడుదలకు ముందు కూడా ఈ నిర్మాణ సంస్థపై దాడులు జరిగాయి. మరి మైత్రీ మూవీ మేకర్స్ పై అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు జరగడాని కారణలు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#BREAKING దర్శకుడు సుకమార్ ఇంటి పై కూడా ఐటీ రైడ్!
— devipriya (@sairaaj44) April 19, 2023