టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు విశ్వక్. ఫలక్ నుమా దాస్ సినిమాతో యూత్ లో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న విశ్వక్.. ఆ తర్వాత హిట్, పాగల్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఆలస్యమైనా మంచి సినిమాతో వద్దామనే ఉద్దేశంతో ఈ యువహీరో.. సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవలే విశ్వక్ సేన్.. ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ మూవీతో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం వరుస హిట్స్ లో ఉండేసరికి విశ్వక్ తదుపరి సినిమాలకోసం నిర్మాతలు క్యూ కడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అలాగే విశ్వక్ తాజాగా రెమ్యూనరేషన్ విషయంలో మార్పులు చేశాడని.. ఇదివరకు 1.5 – 2 కోట్ల వరకు తీసుకున్న విశ్వక్.. ఇప్పుడు 3 వరకూ డిమాండ్ చేస్తున్నాడని.. రెమ్యూనరేషన్ పెంచేసి నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా మొదటి సక్సెస్ అందుకున్న విశ్వక్.. తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ వరకు దాదాపు అన్ని హిట్ సినిమాలే చేశాడు. అదీగాక రీసెంట్ గా తన డ్రీమ్ కారు ‘మెర్సిడెస్ బెంజ్’ కారును కొని ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు.
మరి కోట్లు పెట్టి కారు కొన్నాడంటే.. రెమ్యూనరేషన్ పెంచే ఉంటాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం విశ్వక్ చేతిలో 5 సినిమాలున్నాయి. ఇవేకాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రెండు సినిమాలు, యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ మూవీ చేయటానికి సైన్ చేసినట్లు వినికిడి. ఈ నేపథ్యంలో సినిమాల పరంగా క్రేజ్ పెరిగేసరికి రెమ్యూనరేషన్ కూడా విశ్వక్ పెంచేశాడని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి మాస్ కా దాస్ గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. రెమ్యూనరేషన్ పెంచాడనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.