Salman Khan: ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. మొదట హిందీలో మొదలైన ఈ షో.. ప్రస్తుతం దక్షిణాది ప్రధాన భాషలన్నిటిలో కొన్ని సీజన్లుగా ప్రసారమవుతోంది. అయితే.. హిందీలో బిగ్ బాస్ షోకి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా గత 15 సీజన్స్ నుండి బిగ్ బాస్ విజయవంతంగా కొనసాగుతోంది.
బిగ్ బాస్ షో గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ, టీవీ సెలబ్రెటీలను వంద రోజుల పాటు ఒకే హౌజ్ లో లాక్ చేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంది. ఇక హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుండి కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, మనస్పర్థలు, ప్రేమ, కన్నీళ్లు అన్నీ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ, వారికంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేస్తుంటాయి. తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. హిందీలో ఏకంగా 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్ కు రెడీ అవుతోంది.
ఈ క్రమంలో బిగ్ బాస్ 16వ సీజన్ పై పలు క్రేజీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ని 15 సీజన్లుగా సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో మేనరిజమ్, హోస్టింగ్ తో సక్సెస్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సల్మాన్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తూ వచ్చారు. గత సీజన్ లో ఒక్కో ఎపిసోడ్ కు రూ. 15 కోట్ల వరకూ తీసుకున్న సల్మాన్.. మొత్తంగా రూ. 350 కోట్లు అందుకున్నాడని సమాచారం.
ఈ నేపథ్యంలో 16వ సీజన్ కు ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని టాక్. ఇంతకాలం అడిగినంత ఇస్తూ వచ్చిన బిగ్ బాస్ నిర్వహకులు సల్మాన్ డిమాండ్ చేసిన నెంబర్ విని ఒక్కసారిగా అవాక్కయ్యారట. 16వ సీజన్ మొత్తానికి సల్మాన్ అడిగింది రూ.1000 కోట్లు అని, నిర్వాహకులు సైతం అంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ విషయంపై ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు లేదా సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా బిగ్ బాస్ 16న సీజన్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రారంభం కానుందట. మరి సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#BiggBoss16: #SalmanKhan to charge over Rs 1000 crore for upcoming season?https://t.co/jlAe2dBWOW
— DNA (@dna) July 15, 2022