ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘RC15’ అని వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. పొలిటికల్ యాక్షన్ జానర్ లో సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాని ఓకే చేసి సర్ప్రైజ్ చేశాడు చరణ్. తన తదుపరి సినిమాని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో చేయనున్నాడు. ఈ రెండు కాకుండా తాజాగా మరో సినిమా లైనప్ అవుతోందని సోషల్ మీడియాలో టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇంతకీ టాక్ ఏంటి? అనంటే.. ఈ ఏడాది ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీతో వివాదాస్పదమైన బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. సోషల్ మీడియాలో వివేక్ – చరణ్ ల పేర్లు ట్వీట్స్ తో సహా ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్, మెగా ఫ్యాన్స్. అసలు విషయానికి వస్తే.. ఓ మెగా ఫ్యాన్.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ.. రామ్ చరణ్ తో మీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అని పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ స్పందించిన దర్శకుడు.. ‘మమ్మల్ని అలాగే బ్లెస్ చేయండి’ అని రిప్లయ్ ఇచ్చాడు. ఇక డైరెక్టర్ నుండి ఊహించని సమాధానం వచ్చేసరికి ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యంతో సందడి చేస్తున్నారు.
ప్రస్తుతానికి చరణ్, వివేక్ ల కాంబినేషన్ లో సినిమా రానుందని బలంగా కథనాలు వినిపిస్తున్నాయి. కానీ.. దీనిపై అటు చరణ్ గాని, వివేక్ గానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పైగా వివేక్ ఇచ్చిన రిప్లయ్ కూడా.. ‘చరణ్ తో సినిమా నిజంగానే సెట్ అయ్యేలా కోరుకోండి’ అన్నట్లు అర్థం కూడా వస్తుందని కొందరు అంటున్నారు. ఇంకొందరు అదంతా ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉండగా.. చరణ్ RC15, బుచ్చిబాబు సినిమాల తర్వాత సుకుమార్ తో చేస్తాడని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇక చరణ్ – ఉపాసన ఇటీవలే ఫ్యాన్స్ కి పేరెంట్స్ కాబోతున్నట్లు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. సో.. చూడాలి మరి వివేక్ తో సినిమా ఉంటుందా లేదా? అనేది. మరి వివేక్ అగ్నిహోత్రితో చరణ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Yes, #RC17 is almost confirmed now…#RamCharan #VivekAgnihotri #Sukumar #AbhishekAgarwal pic.twitter.com/keFeqEWPSY
— ABHISHEK RAJORA (@Abhishek98916) January 2, 2023
@Alwaysramcharan @AbhishekOfficl Producer. @Vivekagnihotri Director. #Sukumar Writing #RC16 pic.twitter.com/G45nk5hLre
— Sudheer (@Sudheer52544056) November 29, 2022
@vivekagnihotri rt #Rc16 or #Rc17 sukumar – @AlwaysRamCharan – Devisriprasad – abhishekagarwalarts confirmed ✅ pic.twitter.com/uAnGdv9HTn
— Always Unique Reddy | #RC15™🚜 (@alwaysunique161) November 4, 2022