ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచేశాడు. దర్శకుడు శంకర్ తో RC15 చేస్తూనే.. మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సినిమా ఓకే చేశాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనుందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో RC15 చేస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పీరియాడిక్ అంశాలు కూడా ఉన్నట్లు టాక్. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మిస్తున్నాడు. దీనిలో రామ్ చరణ్ రెండు పాత్రలలో కనిపించనున్నాడట. ఇక తర్వాత సినిమా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేయనున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే మరో బిగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చరణ్. ఈసారి తెలుగు డైరెక్టర్ కాదు.. ఏకంగా కన్నడ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడలో మఫ్టీ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ నర్తన్ స్టోరీని రామ్ చరణ్ ఓకే చేసినట్లు సమాచారం.
ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. సినిమాని భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం స్క్రిప్ట్ పనిలో ఉన్నాడట డైరెక్టర్ నర్తన్. ఫైనల్ వెర్షన్ ఓకే అయితే.. అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉండగా.. నర్తన్ ఆల్రెడీ ఓ సినిమా కేజీఎఫ్ ఫేమ్ యశ్ తో ఓ సినిమా తీయనున్నట్లు వార్తలొచ్చాయి. ఇంతలో ఏమైందో గానీ సడన్ గా రామ్ చరణ్ తో సినిమా అనేసరికి మెగా ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి రామ్ చరణ్ ప్రస్తుతం లైనప్ చేసిన సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.