NBK108: నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య నుండి తదుపరి సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. డైరెక్టర్ బోయపాటితో మాస్ సినిమా చేశాక.. వెనువెంటనే డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో మాస్ సినిమా చేస్తున్నాడు బాలయ్య. కానీ.. బాలయ్య ఏ హీరోతోనైనా మల్టీస్టారర్ చేస్తే చూడాలని, లేదా ఆయనకు పోటీగా మరోసారి ఎవరైనా సీనియర్ స్టార్ నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా భావిస్తున్నారు.
లెజెండ్ సినిమా తర్వాత అలా బాలయ్యను ఢీకొట్టే స్థాయిలో ఎవరూ కనిపించలేదు. రీసెంట్ గా శ్రీకాంత్ కనిపించాడు. కానీ.. జగ్గూభాయ్ కి, బాలయ్యకి కుదిరిన కెమిస్ట్రీ శ్రీకాంత్ తో కుదర్లేదు. అఖండ సినిమా పెద్ద హిట్టు.. విలన్ గా శ్రీకాంత్ కి మంచి పేరొచ్చింది. కానీ.. జగ్గూభాయ్ తర్వాతే అనిపించిందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ గోపీచంద్ తో సినిమా తర్వాత బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు.
ఈ క్రమంలో బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీలో మాస్ తో పాటు క్లాస్ అంశాలు, కామెడీ కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా హీరోయిన్ శ్రీలీల నటించనున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్యతో పాటు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
అదీగాక ఈ సినిమాలో రాజశేఖర్ ను బాలయ్యకి మంచి స్నేహితుడి పాత్రలో చూపించబోతున్నాడట అనిల్. మొదట నెగిటివ్ రోల్ అని టాక్ వచ్చింది. కానీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకుడు.. రాజశేఖర్ లోని టోటల్ కామెడీ యాంగిల్ బయటికి తీసే ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో మొదటిసారి రాజశేఖర్ తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పనున్నాడని టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Officially #NBK108 Announcement ✅
Anil Ravipudi Joins Hands With NBK 🔥
Regular Shoot starts From October 👍@AnilRavipudi #NandamuriBalakrisha #HBDGodOfMassesNBK #Balayya pic.twitter.com/B6Za2hCwpN— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) June 10, 2022