మెగాస్టార్ చిరంజీవి సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు.. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా స్థాయి ప్రయోగం చేశారు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తో కలిసి ఆచార్య చేశారు. కానీ.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. మలయాళం లూసిఫర్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించనున్నారు మేకర్స్.
ఈ క్రమంలో మెగాస్టార్ సినిమా అంటే.. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగాఫ్యాన్స్ హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. మెగాఫ్యాన్స్ లో మరింత ఊపు తెప్పించేలా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అదేంటంటే.. మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందరి సినిమాలకు చీఫ్ గెస్ట్ గా వెళ్లే మెగాస్టార్ సినిమాకు ఎవరు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే సందేహం అందరిలోనూ నెలకొంది. దీంతో ఇంకెవరు సల్మాన్ ఖానే వస్తాడేమో! ఎందుకంటే.. గాడ్ ఫాదర్ లో స్పెషల్ రోల్ చేశాడు కదా.. అదీగాక సల్మాన్ కి ఇదే ఫస్ట్ తెలుగు సినిమా, పైగా బాలీవుడ్ హీరో. సల్మాన్ కాకుండా ఇంకెవరు వస్తారబ్బా! అని అందరూ ఆలోచనలో పడ్డారు.
ఈ నేపథ్యంలో సల్మాన్ కూడా కాదు.. వేరే స్టార్ సెలబ్రిటీ వస్తాడని అంటున్నారు. ఇంతకీ ఈ మెగా ఈవెంట్ కి రాబోయే ఆ స్టార్ ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును.. ఇంకా కన్ఫర్మ్ అయినట్లు అధికారిక వార్త బయటికి రాలేదు. కానీ.. వస్తే నిజంగానే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. గతంలో సైరా నరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. మరి ఈసారి గాడ్ ఫాదర్ ఈవెంట్ కి కూడా వస్తాడని భావిస్తున్నారు. ఇక సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, అనసూయ, సునీల్, పూరి జగన్నాథ్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి గాడ్ ఫాదర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Get ready for mass event 🔥🥵💥🤙@KChiruTweets @PawanKalyan #Godfather pic.twitter.com/GAVdiyZuKk
— పవర్ స్టార్ గోపీ (@powerStarGopi99) September 6, 2022