ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా అందరికి సుపరిచితమే. ఐరా ఖాన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకపోయిన అమీర్ ఖాన్ కూతురిగా సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టుల ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు అమీర్ ఖాన్ గారాల పట్టి కొంత కాలంగా జిమ్ ట్రైనర్ నూపూర్ శిఖారేతో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్లో పలువురు ప్రముఖ హీరోలకు జిమ్ ట్రైనర్ గా కూడా పని చేసారు. అలాగే అమీర్ ఖాన్‌కు కూడా వ్యక్తిగత ట్రైనర్‌గా కొన్నాళ్లపాటు పనిచేశారు. ఈ క్రమంలోనే ఐరా హీరోయిన్స్ ను తలపించేలాగా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఐరా తన బాయ్ ఫ్రెండ్ నూపూర్‌తో కూడా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి.
అమీర్ ఖాన్ కూతురు ఇలాంటి పని చేయడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు. పోయిన సంవత్సరం ప్రేమికుల దినోత్సవంను పురస్కరించుకొని ఐరా తన బాయ్ ఫ్రెండ్‌తో ఏకంతంగా గడిపిన ఫొటోలను షేర్ చేయడంతో వివాదానికి తెర లేపాయి. తన బాయ్ ఫ్రెండ్ నూపూర్ శిఖారేతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది.
ఫొటోలో కనిపించే ఇతను నా డ్రీయ్ బాయ్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. అమీర్ ఖాన్ కూతురు ఏంటి ఇలాంటి పని చేసింది ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు.