తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలు తీస్తున్నారు మన డైరెక్టర్లు. అయితే రాను రాను కథ మారుతోంది. ఇప్పుడు పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ మూవీస్ రాబోతున్నాయి. అవును ఇప్పటికే తెలుగు చిత్రాలు హాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అలా కట్టిపడేస్తున్న దర్శకుడికే ఓ అరుదైన గౌరవం దక్కబోతుంది. ఈ క్రమంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2022లో పాల్గొన్నాల్సిందిగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కు ఆహ్వానం అందింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
SS రాజమౌళి.. తెలుగు సినీ పరిశ్రమే కాక యావత్ ప్రపంచ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు. ఆయన సినిమా తీయడానికి టైం పట్టొచ్చు.. కానీ వన్స్ తీశాక రికార్డులు తిరగరాయడానికి మాత్రం టైం పట్టదు. రాజమౌళి తీసిన ప్రతీ సినిమా బ్లాక్ బాస్టరే. అప్పటి స్టూడెంట్ నెం.1 నుంచి నేటి RRR దాక దర్శక ధీరుడి విజయ ప్రస్థానం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంత్యంత ప్రతిష్టాత్మకమైన టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్-2022కు రావాల్సిందిగా రాజమౌళికి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా ప్రకటించింది.
తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత SS రాజమౌళిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. RRR మూవీతో ఆయన హాలీవుడ్ దర్శకుల సరసన నిలిచారు. ఆ చిత్రాన్ని హాలీవుడ్ నటులు, రచయితలు ప్రశంసించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. కెనడాలోని టొరంటో పట్టణంలో ఈ ఫెస్టివల్‌ను ప్రతి ఏడాది అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే దీనికి పలువురు హాలీవుడ్ దర్శకులతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ కూడా పాల్గోనబోతుండటం గమనార్హం.
ఈ సంస్థ ప్రపంచం గర్వించ దగ్గ వారిని పిలిచి వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. అందులో భాగంగానే ఇండియా నుంచి రాజమౌళిని అలాగే హాలీవుడ్ నటుడు టైలర్ పెర్రీని, హిల్లరీ క్లింటన్ ను ఆహ్వానించింది. వారి నుంచి భవిష్యత్ తరాల వారికి విలువైన సూచనలు చేయనున్నారు. అలాగే తమ జీవిత కాలపు అనుభవాలను పంచుకోనున్నారు. ప్రస్తుతం జక్కన హీరో మహేశ్ బాబుతో ఓ మూవీని చేయనున్నట్లు ప్రకటించాడు. దానికి సంబంధించిన కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి దర్శక ధీరుడు రాజమౌళి ఇలాంటి గొప్ప గౌవరం అందుకోవడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Our Visionaries lineup will feature inspirational keynotes from distinguished guests, including @tylerperry and @ssrajamouli (director of RRR) who join previously announced speakers @cakarel (founder and CEO of @MUBI) and @HillaryClinton and @ChelseaClinton. #TIFF22 pic.twitter.com/YAtoeqLX5m
— TIFF Press & Industry (@TIFF_Industry) August 10, 2022