మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన తొలి చిత్రం అతడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదే కాంబోలో వచ్చిన ఖలేజా డిజాస్టర్ అయ్యింది. అయితే టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఈ సినిమాను మిస్ అవ్వరు. ’అతడు‘ ఎప్పుడూ క్లాసిక్ మూవీనే.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన తొలి చిత్రం అతడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదే కాంబోలో వచ్చిన ఖలేజా డిజాస్టర్ అయ్యింది. అయితే టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఈ సినిమాను మిస్ అవ్వరు. గుంటూరు కారం రూపంలో ఇప్పుడు ట్రిబుల్ థమాకా ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే వీరిద్దరి ప్రయాణానికి పునాది అయిన ’అతడు‘ ఎప్పుడూ క్లాసిక్ మూవీనే. ఇందులో మహేష్ సైలెంట్ యాక్టింగ్, త్రివిక్రమ్ కిల్లింగ్ డైలాగ్స్ అదరగొట్టేస్తుంటాయి. ఇక పాటలు మణిశర్మ అందించిన బాణీలు ఇప్పటికీ ప్రెష్‌గా అనిపిస్తుంటాయి.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. అయితే ఆమెకో చైల్డ్ గ్యాంగ్ ఉంటుంది. ఈ సినిమాలో మహేష్ హీరోయిన్ ఇంట్లోకి ఎంట్రీ కాగానే.. ఓ పిల్లాడు వచ్చి నువ్వు అంటూ పలకరిస్తాడు గుర్తుందా. అలా గుర్తు ఉండకపోవచ్చు కానీ బ్రహ్మనందం కొడుకు అంటే ఆ.. ఆ పిల్లోడా అంటూ నోరెళ్లబెడతారు. అందులో ‘నాన్నా నాకోసం రైలు తెచ్చావా’ అనగానే.. తెచ్చాను రా ఫ్లాట్ ఫారమ్ మీద ఉంది తెచ్చుకో అనగానే.. ఓకే అంటూ వెళ్లిపోతాడు. అలాగే బ్రహ్మనందం కడుపులో కొట్టే సీనులో కూడా కనిపిస్తాడు. ‘నీకు చాలా బలముంది నాన్నయో’అని, మన స్కూల్ బెంచ్ లా ఎంత గట్టిగా ఉందిరా అంటూ డైలాగులు కురిపిస్తాడు. ఇప్పుడు ఆ బుడ్డోడు ఎలా ఉన్నాడో తెలుసా.. అతడు హీరో అయ్యాడు.
ఆ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్. ఆ తర్వాత ఆర్య, పెదబాబు, ఆంధ్రుడు, భద్ర, లెజెండ్ వంటి చిత్రాల్లో కనిపించాడు. 2014లో విడుదలైన మిణుగురులో కీలక పాత్రలో కనిపించి జాతీయ అవార్డును కూడా పొందాడు. ఆ తర్వాత హీరోగా మారి వందనం అనే సినిమాలో కనిపించాడు. అయితే ఈ సినిమా వచ్చినట్లు కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మరో సినిమాతో ముందుకు వస్తున్నాడు. సిద్దార్థ్ రాయ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పుడు మరింత హ్యాడ్సమ్గా మారి, మంచి బాడీలుక్తో కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ మరియు విహాన్ & విహిన్ క్రియేషన్స్‌పై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.