ఇలియానా..అందంతో కుర్రకారును తన వైపు తిప్పుకునేందుకు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. బక్కపలచని శరీరంతో సన్నజాజిలాంటి నడుముతో యువకుల గుండెల్లో గూడుకట్టుకుంది ఈ గోవా బ్యూటీ. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఇలియాన. ఈ మూవీలో ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి నటించింది. అప్పట్లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీకి కథతో పాటుగా పాటలు కూడా ప్లస్ కావటంలో అనుకోని విజయం సాధించింది. ఇక ఈ విజయంతో ఇలియానా క్రేజ్ ఒక్కసారిగా ఎగిసిపడింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
టాలీవుడ్ లోని స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి నటులతో ఆడిపాడే ఛాన్స్ కొట్టేసిన ఇలియానా నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నాళ్ళు సినిమాలు చేసిన ఇలియాన బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావటంతో అక్కడికి చెక్కేసింది. దీంతో అక్కడ కుడా అడపాదడపా సినిమాలు చేసినా.. కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాలు మూటగట్టుకుంది. బాలీవుడ్‌లో సినిమాలు, ఫ్యాషన్ షోలు చేస్తున్న సమయంలోనే ఇలియానాకి ఆండ్రూ అనే విదేశీ ఫొటోగ్రాఫర్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ రెండేళ్ల క్రితం బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బికినీ అందాలతో కుర్రకారు మతి పోగొట్టేంత పని చేసింది. బికినీతో బీచ్ లో దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఇందులో తన ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీ దిగిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. గతంలో కాస్త బొద్దుగా మారిన ఇలియాన ఇప్పుడు మాత్రం నాజుకు అందంతో మత్తేకిస్తోంది. దీంతో తన అభిమానులు ఒక్కొక్కరు ఒకోలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది ఈ గోవా బ్యూటీ.