ఈమధ్య కాలంలో ఓటీటీలకు మూవీ లవర్స్ బాగా అడిక్ట్ అయ్యారు. వేర్వేరు భాషలకు చెందిన విభిన్నమైన కంటెంట్ అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఓటీటీల్లో చూడలేని వారు, ఈ ప్లాట్‌ఫామ్స్‌కు సబ్‌స్రైబ్ చేసుకోలోని వారు ఐ–బొమ్మ లాంటి ఫ్రీ డౌన్లోడ్ వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు.
సినిమాలు చూసే విషయంలో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీల రాకతో ఒక్కసారిగా అనూహ్య మార్పులు వచ్చేశాయి. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చేయడంతో అందరూ వాటికి అలవాటు పడ్డారు. మంచి కంటెంట్ ఉంటే తప్ప చిత్రాలు పెద్దగా ఆడటం లేదు. ఇక, ఓటీటీల్లో కావాల్సిన మూవీస్, వెబ్ సిరీస్‌లను చూడాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నింటినీ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే డబ్బులు బాగా పెట్టాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయంగా కొన్ని వెబ్‌సైట్స్ వెలుగులోకి వచ్చాయి. ‘తమిళ్ రాకర్స్’, ‘మూవీ రూల్స్’ లాంటివి అన్ని సినిమాలను అందిస్తున్నాయి. అయితే ఈ కోవకు చెందిన ‘ఐ–బొమ్మ’ సైట్ మాత్రం తెగ పాపులర్ అయింది.
ఓటీటీల్లో విడుదలైన కంటెంట్‌ను డబ్బులు పెట్టి చూడలేని వారికి ఐ–బొమ్మ ఒక వరంలా మారింది. హై క్వాలిటీలో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం ఉండటం, డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండటంతో చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోయారు. యూజర్ ఫ్రెండ్లీగా పేరు తెచ్చుకున్న ఈ వెబ్ సైట్ తాజాగా యూజర్లకు షాక్ ఇచ్చింది. మూవీ లవర్స్‌ను అలరిస్తున్న ఐ–బొమ్మ వెబ్సైట్ మళ్లీ నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సైట్ ఓపెన్ చేస్తే దేశంలో సేవలు నిలిచిపోయినట్లు ఓ మెసేజ్‌ను చూపిస్తోంది. గతంలో కూడా ఇలాగే పలు కారణాలతో ఈ వెబ్‌సైట్‌ను మూసేస్తున్నట్లు ఐ–బొమ్మ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. దీంతో భవిష్యత్తులో ఈ వెబ్సైట్ వస్తుందా? రాదా? అనేది సందేహాస్పదంగా మారింది. మరి.. మీ మొబైల్లో ఐ–బొమ్మ సైట్ ఓపెన్ అవుతోందా? లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ibomma open avvatle enti ettesara?
— Murthy DHFM (@Murthy_4005) February 27, 2023
Ee sadharu ibomma work avvatledu
Movies download cheidaniki website emundi.. TIA.Aada ladies ke kaadu maaku kooda reply ivvvochu friends.
— K P (@isatruelover) February 27, 2023