సినిమా హీరో అబ్బాస్ అనగానే గుర్తుకువచ్చేది ప్రేమదేశం సినిమా. వినీత్, అబ్బాస్, టాబు నటించిన ఈ సినిమా అప్పట్లో చాలా ఫేమ్ తెచ్చుకుంది. కుర్రకారును ఉర్రూతలూగించింది.
అబ్బాస్ అనగానే గుర్తుకు వచ్చేది ‘ప్రేమదేశం’ సినిమా. ఆ రోజుల్లో ఈ సినిమా యువకులను ఓ ఊపు ఊపింది. 90వ దశకంలో అబ్బాస్ హీరోకి చాలా క్రేజ్ ఉండేది. ప్రేమదేశం సినిమా చూసిన ప్రతి యువతి అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని అనుకునేవారు. అబ్బాస్ కటింగ్ కూడా అప్పట్లో చాలా ఫేమస్ అయింది. స్టూడెంట్స్ అబ్బాస్ కటింగ్ కు ఫిదా అయిపోయారు. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత హార్పిక్ యాడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. గత కొంతకాలంగా ఇండియాను వదిలి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. న్యూజిలాండ్‌లో ఫ్యామిలీతో ఉన్నాడు. ఇటీవల చిన్న సర్జరీ చేయించుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అబ్బాస్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
తన టీనేజ్ అంతా గందరగోళంగా గడిచిపోయిందని చెప్పాడు అబ్బాస్. ఆ సమయంలో తను ఏమీ తెలియలేదని.. టీనేజ్‌లో ఉన్నపుడు తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో తనకు అసలు బతకాలనిపించలేదన్నారు. రోడ్డు మీద ఓ ట్రక్ ఎదురుగా నిలబడ్డాను. కానీ దాని వెనకాలే ఓ బైక్‌పై వస్తున్న వ్యక్తిని చూసి పక్కకు తప్పుకున్నానని చెప్పాడు. ఎందుకంటే ట్రక్ తనను గుద్దేస్తుంది.
అతడు ట్రక్ ని ఢీ కొట్టి బైకిస్ట్ గాయపడతాడని ఆత్మహత్య చేసుకోవడం మానుకున్నాను అన్నాడు. నేనెప్పుడైనా ఇంతే పక్కవాళ్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తాను. తనను కాపాడింది అతనే అని చెప్పాడు. ‘మీరు ఎదగాలంటే పక్కనున్నవాడికి సహాయం చేయండి కానీ ప్రతిఫలం ఆశించకండి’ అన్నారు. సినిమాల్లో ఛాన్సెస్ తగ్గిపోయాక కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు అబ్బాస్. అబ్బాస్‌కు తగిన చాన్స్ లు వస్తాయేమో చూడాలి మరి.