ఒకటి కాదూ రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. అయినప్పటికీ ఆత్మ స్థైర్యంతో ఎదుర్కొంది. అన్నీ తగ్గిపోయాయి.. ఇక షూటింగ్ లతో బిజీ కావొచ్చు అనుకున్న సమయంలో మరో వ్యాధి ఆమెను వెంటాడుతోంది. ఈ సమయంలో తాను పడ్డ మానసిక క్షోభ గురించి వెల్లడించిందీ ప్రముఖ నటి.
యమదొంగతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మలయాళ భామ మమతా మోహన్ దాస్ సుపరిచితమే. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నాగార్జున వంటి టాప్ స్టార్ల పక్కన ఆడిపాడింది. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో క్యాన్సర్ బారిన పడిన ఆమె సినిమాలకు విరామం ఇచ్చింది. ఒక్కసారి కాదూ రెండు పర్యాయాలు ఆమెను క్యాన్సర్ అటాక్ చేసింది. అయినా పోరాడి నిలబడింది. పూర్తిగా కోలుకోని తిరిగి సినిమాల్లో నటిస్తున్న సమయలో విటిలిగో(బొల్లు వ్యాధి) అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఇప్పుడు ఈ వ్యాధి మమతా మోహన్ దాస్ పోరాటం చేస్తోంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను అనుభవించిన మానసిక క్షోభ గురించి వెల్లడించింది.
‘మహేష్ మారుతియం షూటింగ్ సమయంలో నా ఒంటి పై మచ్చలు గమనించాను. అవి ముఖం, చేతులు, మెడపై వ్యాపించాయి. పరీక్షల్లో బొల్లి వ్యాధి అని తేలింది. క్యాన్సర్ సోకినప్పుడు నా సమస్య మిత్రులతో, సన్నిహితులతో చెప్పుకున్నాను. అందరూ నాకు మద్దతుగా నిలిచారు. ఈ వ్యాధి గురించి బయట పెట్టలేకపోయాను. ఒంటరిని అయ్యాను. ఒక్కదాన్నే కూర్చొని నెలల తరబడి ఏడ్చుకునే దాన్ని. మెడిసిన్ వాడుతుంటే ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. దీంతో మందులు తగ్గించాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఒంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమోనని భయం వేసింది. వెంటనే నాకు సోకిన బొల్లి వ్యాధి గురించి అందరికీ తెలిసేలా చేశాను. అప్పుడు కొంత ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు ఎవరైనా నీకు ఏమైందని అడిగితే.. నా ఇంస్టాగ్రామ్ చూడమని చెబుతాను’ అని మమతా మోహన్ దాస్ అన్నారు.
యమదొంగ మూవీలో మమతా మోహన్ దాస్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. మమతా మోహన్ దాస్ మంచి సింగర్ కూడా. ఆమె ఆ సినిమాలో ఓ పాటను ఎన్టీఆర్ తో కలిసి పాడింది. కింగ్ నాగార్జునతో కేడి, కింగ్ చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చింతకాయల రవి మూవీలో మమతా మోహన్ దాస్ అనుష్కతో పాటు మరొక హీరోయిన్ గా చేసింది. కృష్ణార్జున, హోమం, నితిన్ తో విక్టరీ వంటి చిత్రాల్లో నటించింది. 2011లో బ్రహెయిన్ వ్యాపార వేత్తతో ఆమెకు వివాహాం జరగ్గా.. మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నారు. తమిళంతో పాటు మలయాళ పరిశ్రమలో రాణించిన హీరోయిన్ త్వరగా కోలుకుని సినిమాల్లో నటించాలని ఆశిద్దాం. మమతా మోహన్ దాస్ నటించిన సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో..కామెంట్ల రూపంలో తెలియజేయండి.