ఒకటి కాదూ రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. అయినప్పటికీ ఆత్మ స్థైర్యంతో ఎదుర్కొంది. అన్నీ తగ్గిపోయాయి.. ఇక షూటింగ్ లతో బిజీ కావొచ్చు అనుకున్న సమయంలో మరో వ్యాధి ఆమెను వెంటాడుతోంది. ఈ సమయంలో తాను పడ్డ మానసిక క్షోభ గురించి వెల్లడించిందీ ప్రముఖ నటి.
ఆడ, మగా తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు.. ఆకర్షణీయంగా.. అందంగా కనిపించాలని భావిస్తారు. సెలబ్రిటీలకు అందమే పెట్టుబడి అని చెప్పవచ్చు. వారి ఫిజిక్‌లో ఏమాత్రం తేడా వచ్చినా తెగ కంగారు పడతారు. అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక సినిమా పరిశ్రమలో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలు.. హీరో, హీరోయిన్‌గా రాణించాలంటే.. ప్రధానంగా ఉండాల్సింది అందం. బ్యూటీ విషయంలో ఏమాత్రం తేడా వచ్చిన.. ఇక వెండితెరకు దూరమవ్వాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో.. తీవ్ర, అరుదైన […]