ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎక్కువగా ఇష్టపడే డ్యాన్స్ షోలలో ‘‘ఢీ’’ మొదటి వరుసలో ఉంటుంది. ఈ షో డ్యాన్స్‌తో పాటు కామెడీని కూడా మిక్స్ చేసి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. దాదాపు జబర్థస్త్‌తో సమానంగా కామెడీని అందిస్తోంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఫన్‌తో ఈ షో సాగుతుంది. ఈ షో ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి రష్మీ, సుధీర్‌ల లవ్ ట్రాక్ ఎంతగానో ఉపయోగపడింది. ఢీ జోడీ సీజన్ 9లో ఇద్దరూ కలిసి టీమ్ లీడర్లుగా పాల్గొన్నారు. ఇద్దరి కారణంగా ఈ షోకు ముందుకంటే ఎక్కువ మైలేజ్ వచ్చింది. వారి లవ్ ట్రాక్ ఎపిసోడ్ల కారణంగా షో రేటింగ్ అమాంతం పెరిగిపోయింది.
తర్వాత సీజనల్లో వీరికి తోడుగా ప్రముఖ కమెడియన్ ఆది కలిశాడు. ఆది రాకతో షో మరింత సందడిగా మారింది. ఆది షోను వన్ మ్యాన్ ఆర్మీగా ముందుకు తీసుకెళ్లటం మొదలుపెట్టాడు. తన పంచులతో షోను మూడు జోకులు.. ఆరు పంచుల్లా నడిపించసాగాడు. పక్కవారెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా.. లేకుండా షోను తన కామెడీ టైమింగ్‌తో మెస్మరైజ్ చేస్తూ వచ్చాడు. దీంతో సుధీర్-రష్మీల లవ్ ట్రాక్‌లకు ఎక్కువగా స్కోప్ లేకుండా పోయింది. అంతేకాదు! ఆది రాకతో సుధీర్‌కు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. జబర్థస్త్‌లోనుంచి తన పర్సనల్ కారణాల వల్ల బయటకు వచ్చిన సుధీర్.. ఢీలోంచి బయటకు రావటానికి ఆదియే కారణంగా తెలుస్తోంది. ఆది తనకు షోలో స్కోప్ లేకుండా చేస్తున్నాడని భావించే సుధీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం సుధీర్, రష్మీలే కాదు.. ఆదితో పాటు షోలో చేసిన చాలా మంది యాంకర్లు తొందరగానే షోనుంచి బయటకు వచ్చేశారు.
దీనికి కారణం ఆది వారిని డామినేట్ చేసేలా పర్మామెన్స్ ఇవ్వటమేనట. ఇలా షోలో అవసరం లేని క్యారెక్టర్‌గా ఉండటం కంటే బయటకు వెళ్లిపోవటమే మేలని వారు భావించారట. అందుకే షోనుంచి ఒక్కొక్కరిగా బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఇక, హోస్ట్‌గా ఉన్న ప్రదీప్ ఒక్కడు మాత్రమే నిలదొక్కుకున్నాడు. అయితే, చాలా నెలల తర్వాత సుధీర్ మళ్లీ బబర్థస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఢీ షో గురించి మాత్రం ఏమీ చెప్పటంలేదు. దీనికి కారణం పరోక్షంగా ఆది అని చెప్పొచ్చు. షోను మొత్తం ఒంటి చేత్తో నడిపిస్తున్న ఆదిని కాదని, సుధీర్‌ను తీసుకోవటానికి నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. జబర్థస్త్‌లో దూరమైనా.. ఢీషోలో కలిసున్న సుధీర్, రష్మిలను విడగొట్టిన పాపం మాత్రం హైపర్ ఆదీదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.