హృతిక్ రోషన్- సబా ఆజాద్.. ప్రస్తుతం ఒక్క బాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో వీళ్ల పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని చాలా వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా హృతిక్- సబా ఇద్దరూ కలిసి చాలా సందర్భాల్లో కనిపించారు కూడా. వాళ్లిద్దరు వెకేషన్స్ కి కూడా వెళ్లొచ్చారంటూ పుకార్లు చాలానే వినిపించాయి. అయితే వాటిని వీళ్లిద్దరు ఎప్పుడూ ఖండించలేదు, అలాగని సమర్థించలేదు కూడా. వీళ్ల గురించి మాట్లాడుకునేవాళ్లు మాత్రం నిజంలేకపోతే అలా సైలెంట్‌గా ఊరుకోరు కదా అని తెలివిగా మాట్లాడుతున్నారు. మౌనం అర్ధాంగికారం అంటూ సామెతలు కూడా వల్లిస్తున్నారు.
ఇప్పుడు తాజాగా హృతిక్ రోషన్- సబా ఆజాద్‌కు సంబంధించిన ఇంకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది ఒకవేళ రూమర్ అయినా కూడా కాస్త ఖరీదైన రూమర్ అనమాట. నిజానికి వీళ్లిద్దరూ ముంబయిలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటూ ఉంటారు. అయితే త్వరలోనే ఇద్దరూ ఒకే ఇంటికి మకాం మార్చబోతున్నారని బీటౌన్‌లో గుసగుసలు వినపిస్తున్నాయి. సబాతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు బీచ్ వ్యూతో రెండంతస్థుల భవనాన్ని హృతిక్ రోషన్ కొనుగోలు చేశాడని చెబుతున్నారు. అయితే రెండు అంతస్థులేగా ఎంత ఉంటుందిలే అని లైట్ తీసుకోకండి. దాని ధర దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
Hrithik Roshan and Saba Azad to move in together soon | Exclusive Hrithik Roshan and Saba Azad to move in together soon Exclusive https://t.co/DysH5EjA7l pic.twitter.com/bVdEPNQFef
— JOB MELA (@alokbha59102427) November 18, 2022
ఆ భవనం ధర ఎంతో వినగానే ఒక్క బీటౌన్‌లోనే మొత్తం అభిమానులు, సినిమా ప్రేక్షకులు అంతా నోరెళ్లబెడుతున్నారు. ప్రియురాలితో కలిసి ఉండేందుకు హృతిక్ రోషన్ రూ.100 కోట్లు ఖర్చు పెట్టి భవనం కొనుగోలు చేశాడా? అంటూ అవాక్కవుతున్నారు. అయితే ఇది పుకారా? లేక నిజంగా నిజమా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. మరి.. ఎప్పటిలాగానే వీళ్లిద్దరూ మౌనంగా ఉంటారా? లేక అలాంటి భవనాన్ని తాను ఏమీ కొనుగోలు చేయలేదని హృతిక్ రోషన్ ఖండిస్తాడా అనేది మాత్రం వేచిచూడాల్సి ఉంది. హృతిక్ రోషన్ తన భార్య సుజేన్ ఖాన్ 2014లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతి నుంచే హృతిక్- సబా పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కొందరైతే ఈమెతో ఉండేందుకే హృతిక్ భార్యకు విడాకులు ఇచ్చాడని కూడా చెబుతుంటారు.
Hrithik Roshan और Saba Azad 100 करोड़ रुपये के आलीशान अपार्टमेंट में बसाएंगे अपना नया आशियाना#HrithikRoshan#SabaAzad#KaranJohar#100CroreClub
#BoycottBollywood https://t.co/SZZqDAnB6k pic.twitter.com/fJPGcmJ0ST— Rozi Kumari (@m_mayapuri) November 19, 2022