సాధారణంగా అభిమాన సినీతారలు పెళ్లి పీటలెక్కనున్నారని తెలిస్తేనే ఫ్యాన్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా సినిమాలలో హీరోహీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉన్నా.. ఒకే జంట మళ్లీ మళ్లీ సినిమాలు చేసినా.. ఆ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే భావన ఫ్యాన్స్ అందరిలో కలుగుతుంది. కానీ.. ఆ ఇద్దరు హీరో, హీరోయిన్ ప్రేమలో పడితే మాత్రం పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అలా ఇండస్ట్రీలో కోస్టార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.
ఇటీవలే తెలుగు హీరో ఆది పినిశెట్టి, తనతో కలిసి రెండు సినిమాలలో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ మే 18న అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు. అయితే.. పెళ్లి చేసుకున్న వెంటనే ఈ జంట పవిత్ర దేవాలయాలను దర్శించుకునే పనిలో పడ్డారు. వీరి పెళ్ళికి తెలుగు, తమిళ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు.
ఈ క్రమంలో ఆది పినిశెట్టి, నిక్కీల పెళ్లికి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆది పినిశెట్టి, భార్య నిక్కీ గల్రాని నుండి కట్నం ఏమైనా తీసుకున్నాడా? తీసుకుంటే ఎంత తీసుకున్నాడు? అనే చర్చలు ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాలలో కూడా జరుగుతున్నాయి. అయితే.. హీరో, హీరోయిన్ల పెళ్లంటే ఎవరైనా కోట్లలో ఉంటుందని.. అలాగే కానుకలుగా కూడా కోట్ల విలువైనవే తీసుకుంటారని అనుకుంటారు. కానీ ఆది కట్నం విషయంలో అందరికీ షాకిచ్చాడట.
తాను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ నిక్కీ గల్రాని నుండి ఆది కట్నం ఏమి తీసుకోలేదట. పైగా పెళ్లి ఖర్చులు కూడా పూర్తిగా ఆది ఫ్యామిలీనే పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. నిక్కీ ఫ్యామిలీ ఆది ఎంత అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, తనకు తానూ ప్రేమించిన అమ్మాయి చాలని.. డబ్బులు, ఆస్తులు ముఖ్యం కాదని చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లాడాడట. ఈ విషయం తెలిసి నిక్కీ ఫ్యాన్స్ ఆదిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆది ‘ది వారియర్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. మరి ఆది – నిక్కీల జంటపై మాజీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.