తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో మెగాస్టార్ రేంజ్ కి ఎదిగారు చిరంజీవి. కేవలం నటుడిగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలు గెల్చుకున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం సిసీసీ ని ఏర్పాటు చేసి వారి కష్టాలు తీర్చారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటన చేశాడు.
తన పుట్టిన రోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో ఒక ఆస్పత్రి నిర్మించాలనుకుంటున్నానని చెప్పారు. ఆ ఆసుపత్రి తన తండ్రి పేరుమీదుగా నిర్మించనున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ నాకు చిత్రపురి కాలనీలో పేద ప్రజల కోసం పది పడకల హాస్పిటల్ ని నిర్మించాలనే ఆలోచన వచ్చిందని.. ఇది ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుదని అన్నారు.
ఈ ఆసుపత్రిలో బీపీఎల్ కుటుంబాలు, రోజూ వారి శ్రామికులకు అవసరం అయ్యేలా చిత్రపురి కాలనీలో ఈ ఆస్పత్రిని నిర్మిస్తాను. నాకు పెద్ద డాక్టర్లు మంచి పరిచయం వారి సహాయంతో ఇది చేయగలననే అనుకుంటున్నాను. ఇలా చేయడం నాకు ఎంతో సంతృప్తినిస్తుందని భావిస్తున్నాను. ఈ ఆలోచన చెప్పడంతో నాకు వెంటనే తమ సహకారం అందించిన నా తమ్ముళ్లందరికీ థాంక్స్. ఈ పుట్టిన రోజుకి ప్రారంభించి.. వచ్చే పుట్టిన రోజు లోపు దాని సేవలు ఆరంభమయ్యేలా చూస్తానని మాట ఇస్తున్నాను.
ఇక చిత్రపురిలో ఆస్పత్రి నిర్మాణానికి ఎవరైనా మంచి మనసు చాటుకొని ఎవరైనా భాగస్వామ్యులు అవుతానన్నా సరే.. అది నాకు ఎంతో సంతోషం.. సంతృప్తినిచ్చే విషయం. లేదంటే మొత్తం ఖర్చుు నేనే పెట్టుకుంటా. దేవుడు నాకు ఆశక్తి ఇచ్చాడు’ అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.