సినిమా ఓ రంగుల ప్రపంచం.. ఆ ప్రపంచంలో ఓ స్టార్ లా మెరవాలని ఎంతో మంది నటీ, నటులు ఎన్నో కలలతో వస్తుంటారు. అందులో కొంతమంది స్టార్ లాగా వెలిగితే.. మరికొంత మంది ఎవరికీ కనిపించకుండా పోతారు. ఇక మరికొందరు మాత్రం అవమానాలకు తోడు లైగింక వేధింపులకు గురికాబడతారు. ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు అందరు నడుం బిగించి ‘మీటూ’ ఉద్యమానికి తెరలేపారు. అప్పట్లో ఈ ఉద్యమం బాలీవుడ్ లో లేపిన రచ్చ అంతా ఇంతాకాదు. అయితే లైంగిక ఆరోపణలు కేవలం భారతీయ చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. హాలీవుడ్ లో సైతం లైంగిక వేధింపులు కేసులు వెలుగు చూశాయి. తాజాగ లైంగిక వేధింపుల కేసులో ఓ స్టార్ ప్రొడ్యూసర్ కు 24 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
‘మీటూ’ ఉద్యమం కేవలం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. హాలీవుడ్ లో సైతం ఉంది. గత కొంతకాలంగా హాలీవుడ్ నటులు, నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం మనందరకి తెలిసిందే. ఈ క్రమంలోనే హాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత హార్వే వేన్ స్టీన్(70)కు అత్యాచార ఆరోపణలు రుజువు కావడంతో 24 ఏళ్ల జైలు శిక్షను విధించింది అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టు. వివరాల్లోకి వెళితే.. 2013లో ఓ ఇటాలియన్ నటి, మోడల్ పై హర్వే అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడట్లు ఆరోపణలు వచ్చాయి.ఈమెతో పాటుగా 2004 నుంచి 2013 వరకు మరో నలుగురు మహిళలు సైతం హర్వే తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై తాజాగా సోమవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలన్నీ నిజాలే అని నిర్దారణ కావడంతో అతడికి 24 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హార్వే తరపున న్యాయవాది మాట్లాడుతూ.. “ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, సదరు మహిళలు ఇష్టపూర్వకంగానే వేన్ స్టీన్ తో సంబంధాలు పెట్టుకున్నారని, ఈ రెండు కేసుల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితాలు” అని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ బాధితురాళ్లు బలమైన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడంతో వేన్ స్టీన్ దోషిగా తేలాడు. కాగా వేన్ స్టీన్ ఇప్పటికే ఓ మహిళపై రేప్ కేసులో 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.