ఇటీవల మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. పట్టపగలు ఒంటరిగా తిరగాలంటేనే మహిళలు బయపడిపోతున్నారు. సామాన్య మహిళలకే కాదు.. ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు.
సినిమా ఓ రంగుల ప్రపంచం.. ఆ ప్రపంచంలో ఓ స్టార్ లా మెరవాలని ఎంతో మంది నటీ, నటులు ఎన్నో కలలతో వస్తుంటారు. అందులో కొంతమంది స్టార్ లాగా వెలిగితే.. మరికొంత మంది ఎవరికీ కనిపించకుండా పోతారు. ఇక మరికొందరు మాత్రం అవమానాలకు తోడు లైగింక వేధింపులకు గురికాబడతారు. ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు అందరు నడుం బిగించి ‘మీటూ’ ఉద్యమానికి తెరలేపారు. అప్పట్లో ఈ ఉద్యమం బాలీవుడ్ లో లేపిన రచ్చ అంతా ఇంతాకాదు. […]