ఇటీవల మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. పట్టపగలు ఒంటరిగా తిరగాలంటేనే మహిళలు బయపడిపోతున్నారు. సామాన్య మహిళలకే కాదు.. ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు.
ప్రంపంచలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ వేధింపులు.. అత్యాచారాలు సామాన్య మహిళలకే కాదు.. సెలబ్రెటీలకు తప్పడం లేదు. ఇటీవల మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంతో మంది నటీమణులు గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా సాక్షిగా తమ బాధను వ్యక్తపరిచారు. తాజాగా హీరోయిన్లపై అత్యాచారం.. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నిర్మాతకు 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ హార్వే వేన్‌స్టీన్ లైంగిక వేధింపు కేసులో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పది సంవత్సరాల క్రితం ఓ నటిపై హూటల్ గదిలో అత్యాచారానికి పాల్పపడినందుకు నిర్మాత హార్వేకి కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే వివిధ లైంగిక, అత్యాచారాల కేసులో 23 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న హార్వే మరో 16 ఏళ్లపాటు తన జీవితం మొత్తం జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా హార్వే కోర్టుకు వీల్ చైర్ లో వచ్చారు. హార్వే ఆస్కార్ అవార్డు గ్రహీత. కోర్టుకు వచ్చిన ఆయన తనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవొద్దని.. తన వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని తనపై దయచూపించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. హార్వే విన్నపాలు పట్టించుకోని జడ్జీ లిసా లెంచ్ ఆయనకు 16 ఏళ్ల శిక్షతో పాటు మరో మూడు శిక్షలు విధించారు.
2013 లో ఓ నటిపై హార్వే వేన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పపడినట్టు ఇటీవల లాస్ ఎంజెల్స్ న్యాయస్థానం నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాధితురాలు హార్వే పై పలు ఆరోపణలు చేసింది.. అతను తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాడని.. కెరీర్ ముందుకు సాగనివ్వలేదని వీలైనంత ఎక్కువ కాలం అతనికి శిక్ష పడేలా జడ్జీని వేడుకొంది. హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది నటీమణులు, మోడల్స్ అత్యాచార, లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని ఆరోపణలు చేశారు. ఈ బాధితుల్లోస్టార్ హీరోన్లు ఎంజెలీనా జోలీ, జెన్నిఫర్ ఐన్ స్టన్.. మరికొంతమంది ఉన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలే అప్పట్లో మీటు ఉద్యమానికి పునాధులు పడ్డాయి.
BREAKING
Harvey Weinstein sentenced to 16 years for rape.
Rot in Hell. pic.twitter.com/AfPJ4xq6d6
— Sebastian Gorka DrG (@SebGorka) February 23, 2023